newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్ సర్కార్‌పై క్యాట్ ఆగ్రహం

24-12-201924-12-2019 13:18:32 IST
Updated On 24-12-2019 14:03:44 ISTUpdated On 24-12-20192019-12-24T07:48:32.077Z24-12-2019 2019-12-24T07:48:30.339Z - 2019-12-24T08:33:44.336Z - 24-12-2019

జగన్ సర్కార్‌పై క్యాట్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్‌కి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ఉపశమనం లభించింది. జగన్ సర్కార్ తీరుపై ఈ సందర్భంగా క్యాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణకిశోర్‌ని ఎందుకు రిలీవ్ చేయలేదని క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడింది.

ఇవాళ్టి విచారణలో ఏపీ ప్రభుత్వంపై క్యాట్ మండిపడింది. గతంలో చంద్రబాబు హయాంలో కృష్ణ కిశోర్ ఏపీఈడీబీ సీఈవోగా పనిచేశారు. పదిరోజుల క్రితం ఆయన్ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదుచేసింది. 

పరిశ్రమలు, మౌలికవసతులు, వాణిజ్య శాఖ నుంచి అందిన రిపోర్ట్ ఆధారంగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే రెండు మూడు సార్లు హైకోర్టులో కృష్ణకిషోర్‌కు ఊరట లభించింది.

ఈ క్రమంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. కృష్ణ కిశోర్ విషయంలో కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్‌ ప్రశ్నించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల క్రితం ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌‌ను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసింది.

నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదు. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ అసమంజసం.

రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలి. కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్ఎస్ అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హద్దులు దాటిందని క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle