newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

జగన్ సర్కార్‌కి షాక్.. రివర్స్ టెండరింగ్ వద్దన్న కోర్టు

22-08-201922-08-2019 12:58:24 IST
Updated On 22-08-2019 15:11:30 ISTUpdated On 22-08-20192019-08-22T07:28:24.004Z22-08-2019 2019-08-22T07:28:22.245Z - 2019-08-22T09:41:30.874Z - 22-08-2019

జగన్ సర్కార్‌కి షాక్.. రివర్స్ టెండరింగ్ వద్దన్న కోర్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారంలోకి వచ్చినప్పటినుంచి పొదుపు చర్యల్లో భాగంగా జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పై ఫోకస్ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్‌‌ వైపు అడుగులు వేసిన జగన్ సర్కార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణపనులను రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లకూడదని హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. పోలవరం హెడ్ వర్క్స్‌ విషయంలో ఈ తీర్పుకు సంబంధం లేదు. పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చే వరకు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులకు కట్టబెట్టవద్దని హైకోర్టు సూచించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తమకు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ పనులను పిలవడంపై నవయుగ కంపెనీ ఈ నెల 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ నెల 17వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్,  జలవిద్యుత్ కేంద్రాల  పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను పిలిచింది. రూ. 4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ కు రూ. 1800 కోట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు 3100 కోట్లకు టెండర్లను ఆహ్వానించారు.2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు.

నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టు విచారించింది. ఏజీ జెన్‌కో తమకు స్థలం చూపని కారణంగానే జల విద్యుత్ ప్రాజెక్టు పనులు ఆలస్యమైనట్టుగా నవయుగ కంపెనీ హైకోర్టుకు తెలిపింది. తమ కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమంగా ప్రాజెక్టు పనులు నిర్వహించినట్టుగా ఆ కంపెనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈపిటిషన్‌పై అప్పుడు విచారణ జరిపి, తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది.

ఈతీర్పుపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ‘‘పోలవరం రివర్స్ టెండరింగ్ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పోలవరం ఆంధ్రులకు ప్రాణాధార ప్రాజెక్టు. కోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలి. పాత ప్రభుత్వంపై కక్ష సాధింపు వైఖరితో నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైంది.

విద్యుత్ ఒప్పందాలు, పోలవరం విషయంలో కేంద్రం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి వుంటే బాగుండేది. సాక్షాత్తూ జపాన్ ప్రభుత్వం సైతం ఈ ప్రభుత్వ చర్యలు అభివృద్దికి దోహదపడవని లేఖ రాసింది. అయినా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టింది. వ్యక్తిగత అహంభావాలకు, పంతాలకు పోకుండా పోలవరం సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలి’’అని ఆయన పేర్కొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle