newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

జగన్ సర్కారుపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పోరాటం!

29-10-201929-10-2019 09:35:55 IST
Updated On 29-10-2019 16:12:59 ISTUpdated On 29-10-20192019-10-29T04:05:55.447Z29-10-2019 2019-10-29T04:05:53.394Z - 2019-10-29T10:42:59.431Z - 29-10-2019

జగన్ సర్కారుపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పోరాటం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్నటి సాధారణ ఎన్నికలలో జిల్లాలకు జిల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జేజేలు కొట్టాయి. ఫలితమే జిల్లాలో ఎన్ని స్థానాలుంటే అన్ని స్థానాలు ఫ్యాన్ స్వీప్ చేసింది. స్వీప్ చేసిన జిల్లాలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఆది నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానం.. రెడ్డి.. బీసీ సామాజికవర్గాల కలయికతో వైసీపీకి ఆ జిల్లా కంచుకోటగా మారింది.

అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జిల్లాకు రెండు కీలక మంత్రి పదవులిచ్చి గౌరవించారు. అయితే ప్రస్తుతం అక్కడ ముఠా తగాదాలు, ఆధిపత్య పోరు పార్టీకి తలపోటుగా మారింది. ఈమధ్యనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీఓ సరళ మధ్య జరిగిన సంఘటన. ఆ అంశం చివరికి ప్రభుత్వానికి చుట్టుకొనే వరకు వెళ్లడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేయించక తప్పలేదు.

అయితే ఆ వివాదంలో జిల్లా పార్టీ అధ్యక్షడు కాకాని గోవర్ధనరెడ్డి హస్తం ఉందంటూ కోటంరెడ్డి జిల్లా వివాదాల గుట్టు బయటపెట్టేశారు. స్పందించిన అధిష్టానం ఇద్దరినీ అమరావతికి పిలిపించి పంచాయతీ చేసి పంపించారు. ఆ పంచాయతీలో ఇద్దరు నేతలు మేమిద్దరం బంధువులమే.. మాకే గొడవల్లేవన్నారు. అయితే పెద్దలు మాత్రం కోటంరెడ్డిని జిల్లాలో కాకుండా అమరావతికి పరిమితం కావాలని హుకుం జారీచేశారని లీకులొచ్చాయి.

అప్పటికి సద్దుమణిగిందని అనుకున్న కోటం రెడ్డి అసహనం చివరికి అధిష్టానం మీద పోరాటానికి కూడా సిద్ధమే అనేంతవరకు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక తుఫాన్ ధాటికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కార్మికులు ఏకంగా మంత్రులనే చుట్టుముడుతున్నారు. ఈ సమయంలో సొంతపార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ ఇసుక విధానం.. అందులో పెద్ద అవినీతి జరుగుతుందంటూ రచ్చకెక్కడం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది.

 జిల్లాలో ఇసుక సమస్యపై స్పందించిన కోటంరెడ్డి జిల్లా ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని.. ఓ ఎమ్మెల్యే పేరుతో ఇసుక రిచ్ ల నుండి ఇసుక తరలిపోతుందని.. ఆన్ లైన్లో ఇసుక బోర్డు పెట్టిన రెండు నిమిషాలకే నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా జిల్లాలో ఇసుక మాఫియా అంతు చూస్తా.. సామాన్యులకు ఇసుక అందుబాటులోకి రాకపోతే తానే పోరాటానికి దిగుతా అంటూ అంతెత్తున లేచారు.

అయితే ఇసుక మాఫియా జరుగుతుందన్న పొట్టిపాలెం ఇసుక రీచ్ సర్వేపల్లి నియోజకవర్గంలోనిది కాగా రీచ్ నడుపుతున్నది కూడా గోవర్ధన్ రెడ్డి అనుచరుడే. అంటే కోటంరెడ్డి మళ్ళీ గోవర్ధన్ రెడ్డి మీదనే ఆరోపణలు చేశారు. మొన్ననే పిలిచి పంచాయతీ చేయడం.. అసలే ప్రతిపక్షాలు.. ప్రజలు ఆగ్రహంగా ఉన్నఇసుక మీద సొంత ఎమ్మెల్యేనే పోరాటం చేస్తామని హెచ్చరించడంపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందోనన్నది ఆసక్తిగా మారింది.

కాగా కోటం రెడ్డి కూడా తనను జిల్లా నుండి బయటకు పంపి జిల్లా అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి రాజకీయంగా పట్టుసాధించడంతో పాటు తన నియోజకవర్గంలో పార్టీపై వ్యతిరేకత వస్తుండడంతో కోటంరెడ్డి ఇప్పుడు అధిష్టానం మీద పోరాటానికి కూడా సిద్దమైనట్లుగా ఆ జిల్లా రాజకీయాలలో వినిపిస్తుంది. మరి నెల్లూరు రెడ్డి గారికి మరో పంచాయతీ తప్పదా? లేక కోటంరెడ్డికి కత్తిరింపే నిర్ణయమా? అధిష్టానం మనసులో ఏముందో మరి!

 

 

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

   30 minutes ago


జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

   an hour ago


ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

   an hour ago


 ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

   2 hours ago


జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

   2 hours ago


పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

   3 hours ago


ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

   4 hours ago


‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

   4 hours ago


‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

   4 hours ago


శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

   6 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle