newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా?

18-02-202018-02-2020 15:10:22 IST
2020-02-18T09:40:22.254Z18-02-2020 2020-02-18T09:40:20.360Z - - 07-04-2020

జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు తెర లేపుతున్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్. గతంలో కేంద్ర కేబినెట్ లో చేరతారనే ప్రచారం జరిగినా..అది జరగలేదు. ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు..మతపరమైన విమర్శలు..ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు..కేంద్ర సాయం వంటి అంశాలను పరిశీలించిన తరువాత కేంద్ర కేబినెట్ లో చేరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అందుకోసం ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా పూర్తయినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. మరో వైపు ప్రభుత్వంలో చేరితే కేంద్రంపై ఒత్తిడి చేసే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే 2014 తరవాత టీడీపీ పరిస్థితి మళ్లీ వైసీపీకి కలగనుంది. 

ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, ఇతరత్రా కారణాలతో జగన్ కు అపాయింట్ మెంట్ వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ పెద్దలు ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో హడావిడిగా అపాయింట్ మెంట్ ఖరారు చేయడం, జగన్ కూడా వెంటనే సిద్ధం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ మధ్య జాతీయ స్దాయిలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న బీజేపీ పెద్దలు.. దక్షిణాదిన కీలకంగా ఉన్న వైసీపీ, డీఎంకే వంటి పార్టీలను కేబినెట్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాతే వైసీపీకి కేబినెట్ లో చేరాలని ఆహ్వానం అందినట్టుగా ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం పోరాడుతున్న తరుణంలో కేబినెట్ లో చేరడం సరికాదనే వాదనతో వైసీపీ అప్పట్లో కొంత వెనుకంజ వేసింది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం ఎన్డీయే పెద్దలు వైసీపీకి ఆఫర్ చేసినట్టు విజయసాయి అనుచరులు ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఓటమి తర్వాత బీజేపీ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. 

ఢిల్లీ ఓటమిని మరిపిస్తూ కేబినెట్ లోకి దక్షిణాది పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా తాము బలంగానే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దక్షిణాదిన బలంగా ఉన్న వైసీపీ, డీఎంకే పార్టీలను కేబినెట్ లోకి మరోమారు ఆహ్వానించన్నట్లు సమాచారం. మరో వైపు రెండు కేబినెట్ బెర్తులు వైసీపీకి ఇవ్వబోతున్నారన్నది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్న ప్రచారం.

ఆ రెండు పదవులు ఎవరికనేది కూడా చెప్పేస్తున్నారు. అయితే, జగన్ కు కీలకమైన మైనార్టీ..దళిత ఓటు బ్యాంకు పైన ప్రభావం పడుతుందనే భావనతో ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంలో చేరటం పైన జగన్ సంశయించారు. అయితే, వారికి ఏ మాత్రం నష్టం కలగకుండా తాను చూసుకుంటాననే నమ్మకం కలిగిస్తూ కేబినెట్లో చేరే దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎన్డీఏ నుండి శివసేన వెళ్లిపోవటం..ఏపీ నుండి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో వైసీపీకి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే..గతంలో టీడీపీ కేంద్రలో మంత్రి పదవులు తీసుకున్న సమయంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్రనే..ఇప్పుడు టీడీపీ రిపీట్ చేస్తుందని..అందులో ప్రధానంగా హోదా మీద ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం కొందరు ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా ఎలా ఉన్నాముందు ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితులు..ముందున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటున్న వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంలో చేరటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బీజేపీతో జతకట్టడంపై ప్రభావం చూపించనుంది. అదే సమయంలో టీడీపీ జనసేన నేతలు వైసీపీ నేతల మీద మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో..కేంద్ర ప్రభుత్వంలో చేరటం ద్వారా ఈ ప్రచారానికి..ప్రత్యర్ధి నేతలను చెక్ పెట్టవచ్చనేది వైసీపీ వ్యూహం. వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా ఉన్న మైనార్టీ..దళిత ఓట్ బ్యాంకు మీద ఈ నిర్ణయం కారణంగా ఎటువంటి ప్రభావం పడకుండా వారికి ముఖ్యమంత్రి గట్టి హామీ ఇస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle