newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

జగన్ వైపు సినీతారల చూపు

04-04-201904-04-2019 08:15:25 IST
2019-04-04T02:45:25.117Z04-04-2019 2019-04-04T02:45:21.729Z - - 19-11-2019

 జగన్ వైపు సినీతారల చూపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల చుట్టూ సినీతారలు తిరుగుతున్నారు. ఏపీ ఎన్నికల వేళ తెలుగు చిత్ర పరిశ్రమ జనంతో పాటు, బుల్లితెర నటీనటులు కూడా పార్టీల బాట పట్టారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు  ప్రముఖులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వైసీపీ వైపు సినీ జనం క్యూ కట్టడంతో  టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.

సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోతోందని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజా, విజయ్‌చందర్‌ వంటి సీనియర్‌ నటులు మొదట్నుంచీ వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. వీరితో పాటు పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా పార్టీ తరఫున తమ గళం విన్పిస్తున్నారు.

ఇటీవల నటుడు కృష్ణుడు కూడా పార్టీలో చేరారు. తర్వాత సీనియర్‌ నటి జయసుధ, మరో ప్రముఖ హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు.

జగన్ పాదయాత్రలోనూ చాలామంది తారలు పాల్గొని మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్‌ శ్యామల దంపతులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరంతా టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో టీడీపీ ఆందోళన చెందుతోంది.

వీరంతా ఈ నాలుగురోజులు ఏపీలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, ప్రచారంలో పాల్గొంటారు. మొత్తం మీద ఈసారి సినీ గ్లామర్ వైసీపీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. 

 

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   11 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle