newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్ విశాఖ పర్యటన ప్రతిష్టాత్మకం

28-12-201928-12-2019 14:43:53 IST
2019-12-28T09:13:53.970Z28-12-2019 2019-12-28T09:13:47.632Z - - 05-08-2020

జగన్ విశాఖ పర్యటన ప్రతిష్టాత్మకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ విశాఖ. ఇవాళ జగన్ విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. గన్నవరం నుంచి విశాఖ బయలుదేరారు సీఎం వైయస్ జగన్. ఎయిర్ పోర్ట్ నుంచి తాటిచెట్ల పాలెం - సిరిపురం మీదుగా 24 కి. మీ మానవహారం నిర్వహించనున్నారు. విశాఖలో సుమారు 1,290 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

విశాఖను ఏపీ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా నగరానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేశారు. జగన్‌ ప్రకటనపై ఉత్తరాంధ్ర వాసులు ఎంత సంతోషంగా వున్నదీ రాష్ట్రవ్యాప్తంగా తెలియజేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్‌ పర్యటన ఏర్పాట్లపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. జగన్‌కు విమానాశ్రయం నుంచి దారిపొడవునా స్వాగతం పలికేలా ప్రజలను సమీకరించారు.

సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారంతా ఫ్లెక్సీలు, తోరణాలు, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించినందుకు థాంక్యూ జగనన్న అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.నగరంతో పాటు రూరల్‌ జిల్లా నుంచి, పొరుగున వున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా భారీగా జనాలను తీసుకువచ్చారు. జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని నేతలను విజయసాయిరెడ్డి ఆదేశించారు. ఇవాళ్టి జగన్‌ పర్యటన చిరస్థాయిగా నిలిచిపోవాలని, దీన్ని ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు జనసమీకరణపై దృష్టిసారించారు. తమ తమ నియోజకవర్గాల పరిధిలోని నేతలు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను పిలిచి జన సమీకరణకు ప్రయత్నాలు చేశారు. దీంతో విశాఖనగరం వైసీపీ జెండాలు, బ్యానర్లతో కళకళలాడిపోతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle