newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జగన్ విరచిత నారాసుర కథ

28-03-201928-03-2019 09:15:47 IST
Updated On 28-03-2019 18:49:00 ISTUpdated On 28-03-20192019-03-28T03:45:47.024Z28-03-2019 2019-03-28T03:45:42.963Z - 2019-03-28T13:19:00.443Z - 28-03-2019

జగన్ విరచిత నారాసుర కథ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరుకుంటోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తుతోంది. వైసీపీ అధినేత జగన్ ప్రసంగంలో వాడి వేడి పెరిగింది. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, ఎండగడుతూ ఆయన సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలవేళ చంద్రబాబు చేస్తున్న కుట్రలను, మోసాలను టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను చిన్న చిన్న కథలతో ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పడం ఆసక్తిని పెంచుతోంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో  వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘నారాసురుడు’ కథ ప్రజలందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ కథ పాపులర్ అవుతోంది. 

‘చిన్నప్పుడు మనమంతా కథలు వింటాం. మహాభారతం, రామాయణం విన్నాం. రాక్షసుల గురించి విన్నాం. రావణాసురుడు అనే ఒక రాక్షసురుడు ఉండేవాడని చిన్నప్పుడు మన పెద్దవాళ్లు చెప్తే విన్నాం. ఆ రాక్షసుడికి 10తలలు ఉంటాయని కథల్లో విన్నాం. రావణాసురుడికి ఒకేచోట 10 తలలు ఉంటే.. ఇక్కడ మన రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడుకి మాత్రం విడివిడిగా, వేరువేరుగా తలలు ఉంటాయి.

చంద్రబాబుకు ఒక తల తన నెత్తిన ఉంటుంది. ఇంకొక తల తన పెయిడ్‌ యాక్టర్‌ దగ్గర ఉంటుంది. మరొక తల ఈనాడు దినపత్రిక, రాజగురు రూపంలో ఉంటుంది. చంద్రబాబు తోక పత్రిక రూపంలో ఇంకో తల ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులను నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది.  దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు రూపంలో ఇంకొక తల ఉంటుంది’’ అంటూ సావధానంగా వివరించడంతో వైసీపీ శ్రేణులు ఈలలు, హర్షధ్వానాలు చేశారు.

అంతేకాదు  ‘‘కేఎపాల్-చంద్రబాబు లోగుట్టును విప్పేశారు జగన్. వైసీపీ కండువాల మాదిరిగానే వాళ్ల పార్టీ కండువాలు ఉంటాయి. మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్లు హెలికాప్టర్‌ గుర్తు ఉంటుంది. అక్కడ ఒక తల పెడతాడు ఈ చంద్రబాబు. ఇవన్ని సరిపోవన్నట్లు ఢిల్లీ నుంచి నాయకులను పిలుసుకొస్తారు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ల రూపంలో మరో తల పెడతారు చంద్రబాబు. వీళ్లందరిది ఒకటే మాట. ఒకటే డైలాగ్‌. ఒకటే లక్ష్యం.

2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చ జరగకూడదు. వీళ్లంతా ప్రజలను ఏమార్చడానికి  కుట్ర పన్నుతున్నారు. వీళ్లే హత్యలు చేయిస్తారు. వీళ్ల పోలీసులచే విచారణ చేయిస్తారు...’’ అని రావణాసురుడితో చంద్రబాబును పోలుస్తూ ఆయన కుట్రలను వైఎస్‌ జగన్‌ కూలంకషంగా వివరించారు. మొత్తం మీద పిట్టకథలతో జగన్ తన ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మీరు మళ్ళీ ఓటేస్తారా అని ఓటర్లను కోరుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle