newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

జగన్ విప్లవాత్మక నిర్ణయం.. రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం

10-07-201910-07-2019 15:32:14 IST
Updated On 11-07-2019 11:53:01 ISTUpdated On 11-07-20192019-07-10T10:02:14.714Z10-07-2019 2019-07-10T10:01:48.690Z - 2019-07-11T06:23:01.311Z - 11-07-2019

జగన్ విప్లవాత్మక నిర్ణయం.. రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించి అందరి మన్ననలు పొందుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి  బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యలపై స్పందించారు. 2014-19 మధ్య కాలంలో ఏపీలో అన్ని జిల్లాల్లో కలిపి 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారులు గణాంకాలు ఇచ్చారు.

గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. రైతు ఆత్మహ్యతలకు సంబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలని సీఎం జగన్ సూచించారు.

అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లి వారికి పరిహారం అందించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని,  రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలన్నారు.

ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ  మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం.

రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కలెక్టర్‌ కచ్చితంగా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. ఈ విషయంపై మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనిషే చనిపోయాడు.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాద’ని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle