newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

జగన్ విన్నపాలు మోడీ ఆలకిస్తారా?

05-10-201905-10-2019 09:50:37 IST
2019-10-05T04:20:37.150Z05-10-2019 2019-10-05T04:20:03.452Z - - 06-07-2020

జగన్ విన్నపాలు మోడీ ఆలకిస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థిక ఇబ్బందులు.. నవరత్నాల అమలు.. రివర్స్ టెండరింగ్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ సీఎం జగన్ ఇవాళ  ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ సమావేశం కానున్నారు. పీఎంతో సీఎం పలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

రాష్ట్రానికి చెందిన వివిధ పెండింగ్ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

వీటితో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలను ప్రధాని మోదీకి మరోమారు సీఎం నివేదించనున్నారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా సాధించిన విజయాలను కూడా ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి ఎప్పటికప్పడు నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిందిగా జగన్ కోరనున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యేకంగా నిధుల విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం కోరనున్నారు. 

ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయటంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదించనున్నట్టు తెలుస్తోంది.

అలాగే పీపీఏల సమీక్షకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న లేఖలకు రాష్ట్ర ప్రభుత్వ స్పందనను కూడా వివరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానికి వివరిస్తారని సమాచారం.

కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఇప్పటికే వివాదం నెలకొంటున్న వేళ జగన్-మోడీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీని కలిసి వచ్చారు. మరి మోడీ తెలుగురాష్ట్రం ఏపీ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

ఏపీలో 10 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

   27 minutes ago


సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

   38 minutes ago


కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   2 hours ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   2 hours ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   2 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   3 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   3 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   4 hours ago


కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

   16 hours ago


సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle