newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

జగన్ లెక్కలు వేరే ఉన్నాయ్!

12-05-201912-05-2019 09:19:04 IST
2019-05-12T03:49:04.525Z12-05-2019 2019-05-12T03:48:45.436Z - - 18-07-2019

జగన్ లెక్కలు వేరే ఉన్నాయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 23 ముంచుకొచ్చేస్తోంది. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న రోజులు దగ్గరకు వచ్చేశాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని జగన్ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితాల రోజు అద్భుతం జరగడం ఖాయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ ఎక్కడున్నారు? పార్టీ నేతలకు జగన్ ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? వైసీపీ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ శ్రేణులు అధికారం తమదేనని చెప్పుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు జగన్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. తమదే అధికారమని.. ప్రమాణ స్వీకార తేదీని ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకటి రెండురోజులు మాత్రమే జగన్ యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించారు. తర్వాత విదేశీ టూర్ కి వెళ్ళి వచ్చారు. అప్పటినుంచి జగన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రిలాక్సింగ్ మూడ్‌లోనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటికే అనేక విశ్లేషణలు, సర్వేలు వైసీపీ గెలవబోతోందని తెలియజేశాయి. దీంతో ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ మొదలైంది. ఎన్నికల ప్రచార సమయంలో కొంత మందికి మంత్రి పదవులు ఇస్తానని స్వయంగా ప్రకటించినా.. ఆ తర్వాత మాత్రం జగన్ ఎవరికీ హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు మంత్రిపదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా  టీడీపీ ప్రభుత్వ హయాంలో తన వాయిస్ బలంగా వినిపించిన నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా ఈసారి గెలిచి మంత్రి పదవి చేపట్టడం గ్యారంటీ అంటున్నారు. రోజాకు కేబినెట్లో కీలక పదవి దక్కబోతుందని చిత్తూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లను కాదని రోజుకు మంత్రిగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేవని మరో వర్గం అంటోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ, అందునా ఒకే జిల్లాలో అవకాశం ఎలా దక్కుతుందని వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 

ఒక వేళ ఆమెకు ఇవ్వదలిస్తే చీఫ్ విప్ పదవి ఇవ్వొచ్చంటున్నారు. ఈ పదవి కూడా కీలకమయినదే కావచ్చని చెబుతున్నారు. అయితే జగన్ రోజా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఫలితాల తర్వాతే అన్నీ అంటున్నాయి లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రిపదవుల గురించి చర్చలు వద్దని, ఫలితాలు వచ్చాక ఆ సంగతి తేలుద్దామని ఇంతకుముందే జగన్ నేతలకు సూచించారు. మరో వారం నాటికి ఒక క్లారిటీ రావచ్చని వైసీపీకి చెందిన కీలకనేత ఒకరు ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle