newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

జగన్ రూట్లోకి చంద్రబాబు... స్థానిక పోరుకి రెడీ !

04-10-201904-10-2019 10:03:42 IST
2019-10-04T04:33:42.879Z04-10-2019 2019-10-04T04:33:40.874Z - - 09-12-2019

జగన్ రూట్లోకి చంద్రబాబు... స్థానిక పోరుకి రెడీ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి పార్టీకి అండ‌గా నిలిచిన సామాజిక‌వ‌ర్గాల‌పై మ‌రోమారు పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఫోక‌స్ పెట్ట‌నున్నారు. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ విజ‌య‌వంతం కావ‌డంతోనే వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింద‌ని టీడీపీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. తొలుత పార్టీ ప‌ద‌వుల్లోనే జ‌గ‌న్ ఫార్ములా అనుస‌రించాల‌ని, పార్టీ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

అందులో భాగంగా కీల‌క ప‌ద‌వుల్లో మ‌హిళలు, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలకు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. టీడీపీ అనుబంధ సంఘాల నుంచే ప్ర‌క్షాళ‌న ప్రారంభించి బీసీ వ‌ర్గాల్లో తిరిగి ఆద‌ర‌ణ పొందే విధంగా పార్టీలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించారు. విజ‌య‌ద‌శ‌మి నుంచి మొద‌లు పెట్టి ద‌శ‌ల‌వారీగా పార్టీలో సంస్థాగ‌తంగా మార్పులు, చేర్పులు చేసి టీడీపీకి పూర్వ వైభ‌వం తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ద‌స‌రా నుంచి టీడీపీలో స‌రికొత్త మార్పులు, ప్ర‌యోగాల‌తో కేడ‌ర్‌లో ఉత్సాహం నింపాల‌న చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. టీడీపీ ఎప్పుడూ సెంటిమెంట్‌గా భావించే విజ‌య‌ద‌శ‌మి నుంచే ఈ కార్య‌క్ర‌మాలు మొద‌లు కానున్నాయి. ఇక న‌వంబ‌రు నెలాఖ‌రుకు అన్ని అనుబంధ సంఘాల కార్య‌వ‌ర్గాల‌ను ఎన్నుకుంటారు

స‌మూల మార్పుల్లో భాగంగా, ప్రాంతాల వారీగా సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సామాజిక స‌మ‌తుల్య‌త స‌రిగ్గా లేని కార‌ణంగానే న‌ష్టం జ‌రిగింద‌ని, టీడీపీ నేత‌లు చెబుతూ వ‌స్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా పార్టీలో భారీ మార్పులు జ‌ర‌గ‌నున్నాయి.

పార్టీలో ఉన్న అనుబంధ సంఘాల‌కు నూత‌న కార్య‌వ‌ర్గాల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. అనుబంధ సంఘాల‌లో 30 శాతం యువ‌త‌, 33 శాతం మ‌హిళలు, 50 శాతం బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల వారికి ఛాన్స్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. సామాజిక‌వ‌ర్గాల జ‌నాభా ఆధారంగానే చంద్ర‌బాబు ప‌ద‌వులు కేటాయించ‌నున్న‌ట్టు స‌మాచారం.

కార్య‌వ‌ర్గం స‌భ్యులుగా ఎన్నికైన వారి ప‌నితీరును నిర్ణీత స‌మ‌యంలోగా ప‌రిశీలించి కార్య‌వ‌ర్గంలోని మెజార్టీ స‌భ్యుల నిర్ణ‌యంతో రీకాల్ చేయాల‌నే కీల‌క నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు తీసుకున్నారు. మొత్తానికి పార్టీ నుంచి నేత‌లంతా వెళ్లాక చంద్ర‌బాబు ప్ర‌క్షాళ‌న మొద‌లు పెట్ట‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. లీడ‌ర్లంతా పార్టీని వీడ‌క ముందే కీల‌క మార్పులు చేసి ఉంటే రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle