ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

జగన్ రూట్లోకి కావూరి... ఏలూరుపై గురి ?

20-02-201920-02-2019 11:28:10 IST
Updated On 20-02-2019 11:28:08 ISTUpdated On 20-02-20192019-02-20T05:58:10.078Z20-02-2019 2019-02-20T05:57:34.216Z - 2019-02-20T05:58:08.428Z - 20-02-2019

జగన్ రూట్లోకి కావూరి... ఏలూరుపై గురి ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారు. బీజేపీలో ఉన్న కావూరి సాంబశివరావు వైసీపీ వైపు చూస్తున్నారు. బీజేపీలో తనకు భవిష్యత్ ఉండదని ఆయనకు ఏనాడో అర్థమైపోయింది. మాజీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. టీడీపీ ఎంపీలు ఇద్దరు జగన్ చేత కండువా కప్పించుకున్నారు. 

ఇప్పుడు కావూరి సాంబశివరావు వంతు వచ్చింది. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నారు. అయితే అక్కడ అంత చురుగ్గా వ్యవహరించడం లేదు. తిరిగి రాజకీయాల్లో ఆయన యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. ఏలూరు స్థానం నుంచి ఆయన రెండుసార్లు ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి ఆయన ఏలూరు స్థానం నుంచి లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. 

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. దీంతో కావూరికి ఏలూరు టికెట్ రావడం అంత కష్టమేమీ కాదు. కావూరి వైసీపీలో చేరితే సామాజిక వర్గాల కూర్పులో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని కావూరి వర్గం వారు ఎదురుచూస్తున్నారు. టికెట్ ఖరారైతే కావూరి కాషాయం కండువా తీసేసి వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కావూరి సాంబశివరావు వెళ్లిపోతే బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ నుంచి పోటీచేయడానికి ఆ పార్టీనేతలు జంకుతున్నారు. అందుకు ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూస్తున్నారు


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle