newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక

16-12-201916-12-2019 09:54:37 IST
Updated On 16-12-2019 09:54:35 ISTUpdated On 16-12-20192019-12-16T04:24:37.748Z16-12-2019 2019-12-16T04:19:40.402Z - 2019-12-16T04:24:35.476Z - 16-12-2019

 జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్ ఆరునెలల పాలనపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ రివర్స్ పాలనపై ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు. 

టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ కూడా వెనక్కి నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని విమర్శించారు.

జగన్ వచ్చాక అన్నీ ఆగిపోయాయని టెండర్లన్నీ రివర్స్ చేసుకుని.. రివర్స్ టెండరింగ్ అంటూ అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన రాజధాని అమరావతిని చంపేశారన్నారు. ప్రతి అంశంలోనూ రివర్స్‌లో పాలన సాగిస్తున్నారన్నారు. వైసీపీ తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు.

రాష్ట్రంలో ఉపాధి ఆగిపోయిందని. పారిశ్రామిక వేత్తలు పారిపోయే పరిస్థితి ఏర్పడటమే కాకుండా.. విదేశీ పెట్టుబడులు సైతం రావడం లేదన్నారు. ఇసుక కొరత వల్ల లక్షలాదిమంది కార్మికులు రోడ్డు పడ్డారన్నారు.  రివర్స్ టెండరింగ్‌ పేరుతో రాష్ట్రానికి లబ్ది చేకూరిస్తున్నామంటూ.. రాష్ట్రం అధోగతి పాలయ్యేలా చేస్తున్నారని చంద్రబాబు జగన్ సర్కార్‌ను దుయ్యబట్టారు. ఈ సందర్బంగా జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle