newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

జగన్ రాజకీయాలే పోలవరానికి బ్రేకులేశాయా?

08-10-201908-10-2019 17:35:31 IST
2019-10-08T12:05:31.242Z08-10-2019 2019-10-08T12:05:26.570Z - - 15-12-2019

జగన్ రాజకీయాలే పోలవరానికి బ్రేకులేశాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పలు విన్నతులిచ్చి.. గత నాలుగునెలల కాలంలో ఆయన రాష్ట్రంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై వివరణ ఇచ్చి వచ్చారు. ఆయనిచ్చిన విన్నతులు, వివరణలో కూడా ప్రధానమైన అంశాలలో పోలవరానికి కావలసిన నిధులను విడుదల చేయాలని కోరడంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన నిర్మాణ సంస్థను మార్చడంపై వివరణ ఇచ్చి వచ్చారు.

నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వందకు వంద శాతం నిధులతో కేంద్రమే పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్. అయితే గత తెలుగు దేశం ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. అప్పుడున్న కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తత్సంబంధాల నేపథ్యంలో కేంద్రం కూడా రాష్ట్రానికి అప్పగించింది. అందుకు తగ్గట్లే అప్పటి సీఎం ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకొని గిన్నిస్ రికార్డుల స్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ఫలితంగా అధికారిక లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణం అరవై నుండి డెబ్భై శాతం మధ్య పూర్తయింది.

నిజానికి స్వతంత్రం రాకముందు 1946-47 మధ్య రామపాద సాగరంగా తొలిపునాది రాయి పడితే 2004లో మరోసారి పునాది రాయి వేశారు. ముచ్చటగా మూడోసారి 2015లో మరోసారి పడిన పునాది రాయితో ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా ఊపందుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారగా కేందంలో మాత్రం అదే ప్రభుత్వంలో మరోసారి అధికారంలోకి వచ్చింది. గత నాలుగేళ్ళ స్పీడ్ మరో ఏడాది కనుక కొనసాగితే ప్రాజెక్ట్ కల సకాయరమవుతుంది. అయితే ఇప్పుడు ఆ స్పీడ్ అందుకుంటుందా? అసలు ప్రాజెక్ట్ పూర్తవుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలే ప్రాజెక్టుకు బ్రేకులేశాయని ఈరోజు కొన్ని పత్రికలలో కథనాలొచ్చాయి. ఇందులో ప్రధాన కారణాలను తీసుకొంటే పోలవరం ప్రాజెక్ట్ అంచనా విలువ పెరగడం ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అంచనా విలువను గత ప్రభుత్వం భారీగా పెంచేసింది. దీనికి కారణం ప్రాజెక్ట్ నిర్వాసితుల నష్టపరిహారమే కారణంగా గత ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అంచనాల పెంపుపై తీవ్ర విమర్శలు చేసింది. ఏదైతేనేం చివరికి కేంద్రం పెరిగిన విలువను పరిగణలోకి తీసుకొని ఆర్థిక శాఖకు పంపింది. ప్రస్తుతం అది ఆర్థికశాఖ పరిధిలో ఉంది.

ఇక రెండో ప్రధాన కారణం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధుల రీఎంబర్స్ మెంట్. గత ప్రభుత్వంలో కేంద్రం నుండి నిధులు రావడం ఆలస్యమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఖర్చు పెట్టింది. అలా ఖర్చు పెట్టిన నిధులలో దాదాపుగా ఐదువేల కోట్లకు పైనే రాష్ట్రానికి రావాల్సి ఉంది. గత ఏడాదిగా చంద్రబాబు కేంద్రానికి పలుమార్లు ఆ నిధులను చెల్లించాలని రకరకాలుగా కేంద్రాన్ని కోరారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఢిల్లీ నుండి నిధులను రాకుండా రాజకీయం చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ. ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతుందని ఆ పార్టీ నేతలు కేంద్రానికి ఎన్నో పర్యాయాలు కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు.

మూడోది ఈ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానం. రీ టెండరింగ్ వలన ఎనిమిది వందల కోట్లు అదా చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా ఒక్కటే సంస్థ టెండర్లు వేయడం వెనుక రిజర్వ్ టెండరింగ్ ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. కాగా గత ప్రభుత్వంలో పనులు చేపట్టిన కంపెనీ తమను తప్పించి మరొకరికి అప్పగించడంపై కోర్టుకు వెళ్ళింది. మరి అక్కడ ఈ కేసు ఎప్పటికి తేలుతుంది? అప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టేందుకు కేంద్రం కోర్టును కాదని రాష్ట్రానికి ఒకే చెప్తుందా? అన్నది ఇప్పుడే తేల్చలేని అంశం.

రియంబర్స్ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ ప్రస్తుతం కేంద్రాన్ని కోరగా గత ప్రభుత్వంలో ఆ నిధులపై ఆరోపణలు చేసింది తమ పార్టీ నేతలే అన్న విషయం కేంద్రం వద్ద ఉండనే ఉంది. ఇక ప్రాజెక్ట్ అథారిటీ వద్దన్నా వినకుండా వెళ్లిన రివర్స్ టెండరింగ్ విధానం మరో అడ్డుగా కనిపిస్తూనే ఉంది. ఆర్ధిక శాఖ వద్ద ఉన్న పెరిగిన అంచనాలను కేంద్రం ఏ కొర్రీలు పెట్టకుండా విడుదల చేస్తుందా అన్నది మరోసారి ఆలోచించుకోవాల్సిన విషయంగానే కనిపిస్తుంది. మరి ఇన్ని అడ్డంకుల మధ్య ప్రాజెక్ట్ మొదలవుతుందా? పూర్తవుతుందా? ఆంధ్ర ప్రజల కల సాకారమయ్యేనా? కలగానే మిగిలేనా? అన్నది చూడాల్సిఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle