newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

జగన్ రాకతో వలసలకు ఊపు

26-02-201926-02-2019 13:52:08 IST
2019-02-26T08:22:08.437Z26-02-2019 2019-02-26T08:22:05.840Z - - 21-08-2019

జగన్ రాకతో వలసలకు ఊపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో వలసల సీజన్ కొనసాగుతోంది. కానీ మధ్యలో చిన్న బ్రేక్. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌లో మళ్ళీ వేగం పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈమధ్య లండన్ పర్యటనకు వెళ్ళారు. దీంతో ఆయన్ని కలిసే వారు తగ్గారు. ఆయన లండన్ పర్యటన ముగించుకుని వచ్చేశారు. మంగళవారం హైదరాబాద్‌కి వచ్చిన జగన్‌తో భేటీకావడానికి టీడీపీ నేతలు కొందరు క్యూ కట్టారని తెలిసింది.

లండన్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న కూతురును చూసి రావడానికి జగన్ వెళ్లారు. ఆయన పర్యటనకు కోర్టుకూడా అంగీకారం తెలిపింది. కాస్త విరామం అనంతరం జగన్ శిబిరంలో రాజకీయం మరింత ఆసక్తిదాయకంగా మారింది. టీడీపీ నుంచి వచ్చే వారికి జగన్ తలుపులు తెరిచి ఉంచారు. 

లండన్ పర్యటనకు ముందు టీడీపీ ఎంపీలు ఫ్యాన్ పార్టీలో చేరారు. జగన్ తిరిగి వచ్చిన నేపథ్యంలో.. మరింతమంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ జాబితాలో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ ఒకరు, మరో ఎమ్మెల్యేతో పాటు.. కోస్తా ప్రాంతానికి చెందిన నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 27న అమరావతిలోని తాడేపల్లిలో జగన్ నూతన గృహప్రవేశం ఉంది. ఈ కార్యక్రమం ముగిశాక ఈనెలాఖరులో పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకి షాక్ ఇవ్వడానికి ముహూర్తాలు సిద్ధం చేసుకున్నారు. 

టీడీపీ మాజీ ఎంపీ, తాజా ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు కూడా వలస పక్షుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ ఒలకబోసే వల్లభనేని వంశీ పేరు కూడా ఇప్పుడు జాబితాలో కనిపించడం ట్విస్ట్. తమ పార్టీలో చేరడానికి ఇరవై ఐదుమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కొడుకు హితేష్‌ని వైసీపీలో  చేర్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 

దీంతో వైసీపీ కార్యాలయంలో కొత్త కండువాలకు గిరాకీ పెరిగింది. ఈ వలసలను ఆపడానికి చంద్రబాబు ఏ ప్రయత్నం చేస్తారా? పోతేపోనీ.. పోయేవాళ్ళందరూ అవినీతిపరులే అని సరిపెట్టుకుంటారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle