newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జగన్ యాక్షన్.. టీడీపీ రియాక్షన్

25-06-201925-06-2019 08:15:40 IST
2019-06-25T02:45:40.992Z25-06-2019 2019-06-25T02:44:11.630Z - - 20-09-2019

జగన్ యాక్షన్.. టీడీపీ రియాక్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు ప్రజావేదికను మించిన హాట్ టాపిక్ లేదనే చెప్పాలి. జగన్ సీఎం అయ్యాక ప్రజావేదిక కూల్చేస్తానని కలెక్టర్ల సమావేశంలో ప్రకటించడంతో టీడీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదిక కడితే దానిని కూల్చివేయాలని సీఎం జగన్‌ నిర్ణయించడం సరికాదని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.

జగన్ చర్యలను ప్రజలు హర్షించరని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. తమ అధినేత చంద్రబాబు అడిగినందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నేతలు అంటున్నారు. 

ప్రజావేదిక కూల్చివేతపై సీఎం పునరాలోచించాలని వారు కోరుతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు కొన్ని అంశాలను మరచిపోతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.  వైఎస్‌ హయాంలోనే కరకట్టపై అక్రమ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని నేతలు విమర్శించడంపై వారు మండిపడుతున్నారు. వైఎస్ హయాంలో అక్రమాలు జరిగితే టీడీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఏంటని టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. 

ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు కోరడం హాస్యాస్పదం అంటున్నారు వైసీపీ నేతలు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన చంద్రబాబుని వెనకేసుకుని రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఏ నిబంధనల ప్రకారం ప్రజావేదిక కేటాయించాలి, గతంలో ప్రతిపక్ష నేతకు మీరిచ్చిన గౌరవం ఏంటి? శ్లాబ్ నుంచి నీరు కారినచోట ఛాంబర్ ఇచ్చారు. అప్పుడు గుర్తుకురాలేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

కరకట్టమీద నిర్మాణాలు చేయడం తప్పు. 2014లో చంద్రబాబు అధికారంవచ్చాక నోటీసులు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించిన మాట వాస్తవంకాదా? అధికారం కోల్పోయాక అధికారిక నివాసం ఖాళీచేయడం హుందాతనం. అది మీరు మరిచారు. పైగా ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాయడం తప్పు. విపక్షనేతకు మీరు గౌరవం ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎలా అడుగుతారు? అని వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

ఒకవేళ ఆ ప్రాంతం నిబంధనలకు విరుద్ధంగా లేకపోతే అధికారులు ఎలా కూల్చివేస్తారు. దాంతో పాటు నిబంధనలు పాటించని వాటిని కూడా కూల్చేస్తామంటున్నారు. ప్రజావేదికతో పాటు ఆప్రాంతంలోని మిగతా కట్టడాల విషయంలో అధికారులు నిబంధనలు పాటిస్తామని ప్రకటించారు. అలాంటప్పుడు ప్రజావేదిక గురించి రాద్ధాంతం చేయడం సమంజసంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారం కోల్పోయాక అధికారిక నివాసాలను ఖాళీచేయడం ఒక సంప్రదాయం, అవసరం కూడా. మరి అలాంటప్పుడు వాటిని ఖాళీచేయకుండా తమకు కేటాయించమని అడగడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle