newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జగన్ మార్కు పాలన.. వ్యయ నియంత్రణ

30-05-201930-05-2019 15:19:56 IST
Updated On 25-06-2019 14:52:25 ISTUpdated On 25-06-20192019-05-30T09:49:56.160Z30-05-2019 2019-05-30T09:49:42.844Z - 2019-06-25T09:22:25.249Z - 25-06-2019

జగన్ మార్కు పాలన.. వ్యయ నియంత్రణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన ప్రారంభమైందా? ప్రజల మన్ననలు పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే బదులొస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా ఒక యు.వో నోట్ విడుదలైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ తన పాలన మొదలెట్టినట్టు దీని ద్వారా స్పష్టం అవుతోంది.

మే 29వ తేదీతో విడుదలైన ఈ ఆదేశాలలో అనేక అంశాలున్నాయి. ఏప్రిల్ 1, 2019 కంటే ముందు శాంక్షన్ అయిన ఇంజనీరింగ్ పనులు క్షేత్రస్థాయిలో ఇంకా ప్రారంభం కాకుంటే వాటిని రద్దుచేస్తారు. మళ్ళీ తిరిగి వాటికి టెండర్లు పిలుస్తారు.

వివిధ విభాగాలకు సంబంధించి  25 శాతం పనులు పూర్తయితే మిగిలిన కాంట్రాక్ట్ పనులను మళ్ళీ అంచనా వేస్తారు. వాటికి అనుగుణంగా మళ్లీ మదింపు చేసి కొత్త అంచనా ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. ఈ ఆదేశాల ప్రభావం పోలవరం, ఇతర ఇంజనీరింగ్ పనులపై కనిపించనుంది. జగన్ ప్రభుత్వం పొదుపు చర్యలు, వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ ఆదేశం జారీచేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

అంతేకాకుండా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన వివిధ పనుల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. దీనికి విరుగుడుగా ఈ ఉత్తర్వు దోహదం చేయనుంది. ఈ యూవో నోట్ అన్ని శాఖలకు వర్తిస్తుందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేరిట జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే టెండర్లు అన్నీ అవినీతికి అతీతంగా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని శాఖల కార్యదర్శులు ఈ ఉత్తర్వుకి అనుగుణంగా వ్యయనియంత్రణకు కట్టుబడి పనిచేయాలి. పాలనలో అవినీతికి చోటుండకూడదని భావించారు. 

విధి నిర్వహణలో బిజినెస్ రూల్స్ మార్చడం, వాటిని త్యాగం చేయడం చేయాలి. టెండర్ల విషయంలో తాజాగా ఆయా శాఖల అత్యున్నత అధికారుల అనుమతితో తిరిగి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ అధికారులు.  సహాయ పే అండ్ అకౌంట్స్ అధికారులు ఈ ఉత్తర్వుకి అనుగుణంగా వివిధ బిల్లుల చెల్లింపులు జరపాలి. చెల్లింపుల కోసం వచ్చే బిల్లుల విషయంలో ఈ ఉత్తర్వులకు లోబడి అన్నీ జరుగుతాయి. మొత్తం మీద వ్యయనియంత్రణ కోసం జగన్ చేపట్టిన చర్యలు సంచలనంగా మారాయి. ఈ చర్యల వల్ల అధికధరలకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle