newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

జగన్ మాటల దాడి: షర్మిల, విజయమ్మ టూర్ రెడీ

20-03-201920-03-2019 17:26:32 IST
Updated On 20-03-2019 17:26:48 ISTUpdated On 20-03-20192019-03-20T11:56:32.258Z20-03-2019 2019-03-20T11:56:24.534Z - 2019-03-20T11:56:48.829Z - 20-03-2019

జగన్ మాటల దాడి: షర్మిల, విజయమ్మ టూర్ రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అసెంబ్లీ. లోక్ సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ఈసారి చావోరేవో తేల్చుకోవాలని జగన్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వైఎస్ విజయమ్మ, షర్మిల కలిసి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వీరి ఎన్నికల షెడ్యూల్ కూడా  విడుదలైంది. ఈనెల 27న మంగళగిరి నుంచి షర్మిల రోడ్‌షో, బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరి నుంచి ఇచ్చాపురం వరకు 10 జిల్లాల్లో షర్మిల ప్రచారం చేయనున్నారు. షర్మిల ప్రచారంపై వైసీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టడం ఖాయమని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. 

సుమారు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో షర్మిల పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా 40 నియోజవర్గాల రోడ్‌షోలలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రెండు బస్సులను రెడీ చేసింది. మరోవైపు చంద్రబాబుపై మాటల దాడిని పెంచారు జగన్. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి ఇన్నిరోజులవుతున్నా చంద్రబాబునాయుడు నోట్లో నుంచి ఒకే పేరు వినిపిస్తోందని... జగన్‌.. జగన్‌.. జగన్‌.. జగన్‌... కనీసం రోజుకు వంద సార్లు జగన్‌ పేరే చెబుతున్నారన్నారు. తన పాలన గురించి చెప్పకుండా పదే పదే తన పేరే ఎందుకు తలుస్తున్నారని జగన్ విమర్శించారు.

మీ పరిపాలన చూపించి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారలో భాగంగా బుధవారం ఆయన నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా జనం తరలివచ్చారు. జాబు రావాలంటే బాబు పోవాలని జగన్ అన్నారు. ‘‘ఈ ఐదేళ్లలో చంద్రబాబును మీరంతా అతి దగ్గరగా చూశారు. ఆయన నైజాన్నీ, మోసాలను చూడమంటున్నా. ఆయనకు అభ్యర్థులు కరువై 175 స్థానాలకు ఒకేసారి ప్రకటించలేకపోయారు.

మళ్లీ తమ నేతలను టీఆర్‌ఎస్‌ బెదిరిస్తుందంటారు. చంద్రబాబు నాయుడు పాలనలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. చంద్రబాబు నాయుడు నీవు మంచి పాలన చేస్తే.. నీ ఎల్లో మీడియా నీ పాలన మీద చర్చ పెట్టకుండా మా మీదపడి ఎందుకు ఏడుస్తుంది. ఈయనకు సరైన పాలన చేతకాక.. దొంగ ఓట్లను నమోదు చేయడం.. ఉన్న ఓట్లను తొలగించడం చేశారు’’ అన్నారు జగన్. తాను ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle