newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

జగన్ మరో నిర్ణయం.. హోసింగ్ కార్పొరేషన్ 1200 కోట్లు హాంఫట్

13-01-202013-01-2020 10:28:11 IST
Updated On 13-01-2020 10:52:55 ISTUpdated On 13-01-20202020-01-13T04:58:11.955Z13-01-2020 2020-01-13T04:57:57.435Z - 2020-01-13T05:22:55.968Z - 13-01-2020

జగన్ మరో నిర్ణయం.. హోసింగ్ కార్పొరేషన్ 1200 కోట్లు హాంఫట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గత నెలలో పేదల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వ ఖాతాలకు మళ్లించి అటు నుండి అమ్మ ఒడికి ఆ నిధులను చెల్లించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఇలా సామజిక వర్గాల వారీగా కేటాయించిన డబ్బులను ఊడ్చి అమ్మ ఒడికి పెట్టారు. దీనిపై అప్పుడే విమ్మర్శలు వచ్చాయి.

పేదవారికి కేటాయించిన నిధులను పేర్లు మార్చి మళ్ళీ ఆ పేదవారికి కేయించి దానికి నవరత్నాల అమలు కలరింగ్ ఇచ్చారని జీవోలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. సర్కార్ తాజాగా రాష్ట్రంలో పేదలకు గృహాల నిర్మాణ కోసం కేటాయించిన హోసింగ్ కార్పొరేషన్ నిధులను తాజాగా ప్రభుత్వ ఖాతాలో వేసుకుంది.

రాష్ట్ర గృహనిర్మాణశాఖకు హడ్కో ఇటీవల రూ1200 కోట్ల రూపాయలను రుణంగా మంజూరు చేసింది. అయితే రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆ నిధులపై కన్నేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయమని ఆర్ధిక శాఖ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కార్పొరేషన్ల పేరుతో నిధులను రాబట్టి ఆ నిధులను ప్రభుత్వం వాడేసుకోవడం గత ప్రభుత్వంలో కూడా చేసిందే.

ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్పులు తీసుకొనే పరిస్థితి లేదు. లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం కనుక గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం హామీగా ఉంటూ నిధులను తెచ్చుకొని ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆరితేరిపోయింది. కార్పొరేషన్ల పేరుతో ఇచ్చే రుణాలు కూడా పరిమితులు ఉన్నవరకు వాడేసుకుంటుంది.

గత టీడీపీ ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన కార్పొరేషన్ నిధుల జోలికి వెళ్లకుండా గ్రామీణ అభివృద్ధి నిధులు.. ఇంకేవో పేర్లతో సంస్థల ద్వారా తీసుకుంటూ పరిమితులను పాటిస్తే వైసీపీ సర్కార్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా రోజువారీ ఖర్చులకు వాడేసుకుంటుంది. అయితే, ఇలా సంస్థల నిధులను ప్రభుత్వం వాడేసుకోవడంతో వాటిపై కూడా భారం ఎక్కువవుతుంది. రేపు తిరిగి చెల్లించాల్సి వస్తే ముందుగా ప్రభుత్వాలు సంస్థలకు చెల్లించాలి.

ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి చెల్లించే పరిస్థితిలో లేదు. ఇప్పుడు రాష్ట్రమున్న పరిస్థితిలో ఇప్పట్లో తిరిగి కోలుకొని పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈక్రమంలో నిధులు తిరిగి చెల్లించలేక ఇప్పటికే నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలకు బ్యాంకులు డిఫాల్టర్‌ నోటీసులు కూడా ఇచ్చాయి. క్రమేపీ ఈ పరిస్థితే అన్ని సంస్థలకు తలెత్తే అవకాశం ఉండగా ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆదుకొనే నాధుడే ఉండరని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle