newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

జగన్ మంత్రం... మేనిఫెస్టో తంత్రం

06-04-201906-04-2019 12:39:17 IST
Updated On 06-04-2019 12:40:45 ISTUpdated On 06-04-20192019-04-06T07:09:17.896Z06-04-2019 2019-04-06T07:08:37.382Z - 2019-04-06T07:10:45.097Z - 06-04-2019

జగన్ మంత్రం... మేనిఫెస్టో తంత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల ప్రచారం మూడురోజుల్లో ముగుస్తుందనగా ఉగాది నాడు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం అనంతరం మేనిఫెస్టో విడుదల అయింది. రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నామని, మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో మెజారిటీ అంశాలు నవరత్నాలకు సంబంధించిన హామీలే వున్నాయి.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:

* రైతుకు పెట్టుబడి కింద రూ.50 వేలు. పంటవేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో రూ.12,500

* పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్‌, బోర్లు.

* ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూ.1.5లకే(యూనిట్‌) ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు

* రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. పంటవేసే ముందే ధరల ప్రకటన. గిట్టుబాటు ధరలకు భరోసా

* రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.

* ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు

* సహకార డెయిరీకి పాలుపోసే రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌

* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు. టోల్‌ ట్యాక్స్‌ రద్దు

* వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం

* భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ

* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు. నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపు.

 ఆరోగ్యశ్రీ

* రూ.5 లక్షలు ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తింపు

* వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం

* ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఆరోగ్యశ్రీ.. ఏ నగరంలో చేయించుకున్నా వర్తింపు

* చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత

* దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను

* రెండేళ్లలో కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపు

* అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు

* ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థ ప్రక్షాళన. పారదర్శక ప్రమాణాలు

* 45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.75 వేల ఆర్థిక సాయం

* పింఛను రూ.3 వేలకు పెంపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛను.

* పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత

* కుల, మతం తేడా లేకుండా అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు 

* వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి

* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు పది ఉద్యోగాలు

* ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛను వంటి సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం

* ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు 

* యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు వచ్చేలా చూస్తాం.

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు 50 శాతం రిజర్వేషన్‌

మద్యపాన నిషేధం

* సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని మళ్లీ తెస్తాం. పొదుపు సంఘాల వడ్డీ డబ్బు బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుంది. 

* మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.

* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. 13 లక్షల బాధితులకు మేలు. మిగిలిన వారికి తక్షణం పరిష్కారం 

* తిరుమలలో యాదవులు గుడి తలుపులు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ 

* సొంత ట్యాక్సీ నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు

* 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసు వారికి వైఎస్‌ఆర్‌ జీవన బీమా పథకం కింద సహజ మరణమైనా లక్ష రూపాయలు అందజేత

* మాదిగ, రెల్లి, మాలలకు కార్పొరేషన్‌ ఏర్పాటు

* ఎస్సీ, ఎస్టీల యువతుల పెళ్లికి రూ.లక్ష

* గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు. అందులో విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, కళాశాల ఏర్పాటు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

* ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు

* ప్రభుత్వ పాఠశాలలో చదువుల ప్రమాణాలు మార్చుతాం. ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధన. మాతృభాషకు సముచిత స్థానం

* ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు తగ్గింపు. ప్రైవేటు ఉపాధ్యాయుల స్థితిగతుల మెరుగుకు రెగ్యులేటరీ కమిటీ

* జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు 

బీసీలకు..

* బీసీల అభ్యున్నతికి ఏటా రూ.15 వేల కోట్ల ఖర్చు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు

* అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు. అన్ని కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ చేస్తూ చట్టం

* బీసీలోని ఉపకులాల్లో వారికి కార్పొరేషన్లు ఏర్పాటు. బీసీ యువతులకు పెళ్లి కానుక రూ.55 వేలకు పెంపు

* శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు.  బీసీ కులాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు

* దుకాణాలున్న దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం

* వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ రూ.10 వేల ఆర్థిక సాయం 

* పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

* ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రోత్సాహకం

* కులవృత్తులు, చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు. వీరికి రూ.10 వేల వరకు సున్నా వడ్డీకే రుణాలు

* బీసీ హక్కులకు భంగం, నష్టం కలగకుండా ఉండే రిజర్వేషన్లు 

* కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల చొప్పున పదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు

* జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్‌ పీరియడ్‌లో రూ.5 వేల భృతి. హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు తక్కువ ధరకే.

* అర్చకులకు పదవీ విరమణ రద్దు. పంచాయతీ జనాభాను బట్టి రూ.10 నుంచి రూ.35 వేల వరకూ వేతనాలు, ఇళ్ల నిర్మాణం

* మైనారిటీ సబ్‌ ప్లాన్‌. వక్ఫ్‌, ముస్లిం మైనారిటీలకు సంబంధించి స్థిర చరాస్తుల రీసర్వే.

* ముస్లిం, మైనారిటీ యువతులకు పెళ్లికి రూ.లక్ష

* హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం. ఇమామ్‌, మౌజమ్‌లకు వేతనంగా రూ.15వేలు. ప్రమాదవశాత్తు ముస్లిం, మైనారిటీ మరణిస్తే రూ.5 లక్షలు 

* క్రిస్టియన్ల యువతి వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం. పాస్టర్లకు వివాహ రిజిస్ర్టేషన్‌ సులభతరం. వారికి రూ.5వేలు గౌరవవేతనం

* ప్రమాదవశాత్తు క్రిస్టియన్లు మరణిస్తే రూ.5 లక్షలు

* అన్ని అగ్ర కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు

* కులం, మతం, వర్గానికి తావు లేకుండా సుపరిపాలన

25 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్

* ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్తాం. రాజధానిని ఫ్రీజోన్‌గా మారుస్తూ అందరికీ ఉద్యోగాలు వచ్చే ప్రాంతంగా గుర్తిస్తూ వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి  

* గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు

* ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు. పాత పింఛను విధానం అమలు. ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం ఐఆర్‌. సకాలంలో పీఆర్సీ అమలు

* అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత పనిని బట్టి క్రమబద్ధీకరణ

* పోలీస్‌లకు వారాంతపు సెలవు అమలు

* అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా రూ.వెయ్యి ఎక్కువగా ఇస్తాం.

* ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు

* పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలకు తోడు ఏపీఐఐసీని పునరుద్ధరణ, నిరుద్యోగ యువతకు సబ్సిడీ

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle