newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

జగన్ ఫోటో చాలు మిమ్మల్ని ఆపేవాడే లేడట!

05-10-201905-10-2019 09:02:33 IST
Updated On 05-10-2019 15:37:15 ISTUpdated On 05-10-20192019-10-05T03:32:33.053Z05-10-2019 2019-10-05T03:32:28.740Z - 2019-10-05T10:07:15.491Z - 05-10-2019

జగన్ ఫోటో చాలు మిమ్మల్ని ఆపేవాడే లేడట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొందరు యువకులు తన బైకులు, కార్ల మీద రాజకీయ నాయకులు, అభిమాన హీరోల బొమ్మలేసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. ఇది పిచ్చికి పరాకాష్టగా చెప్పుకోవాలి. బెజవాడ పరిసరాలలో ఈ వ్యవహారం కొన్ని చోట్ల శృతి మించి వివాదాలకు కారణాలైన సంఘటలు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు ఏపీకి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అందువలన సీఎం జగన్ బొమ్మ వాహనాలపై వేసుకుంటే వాళ్ళని ఏ పోలీసులు, ఏ అధికారులు ఆపరట. ఈ మాట చెప్పింది.. ఇంతటి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎవరో కాదు. ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్.

ఏలూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాహనామిత్ర పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి అవంతి ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాబ్‌లు, ఆటోలను నడిపే డ్రైవర్లందరూ మీ వాహనంపై సీఎం జగన్‌ ఫొటో పెట్టుకోండి. ఆర్టీఏ అధికారులెవరూ మిమ్మల్ని ఆపరు' అని చెప్పారు. అంతటితో ఆగకుండా విమానాల్లో తిరిగేవారు కాదు.. ఆటో డ్రైవర్లే తమకు ముఖ్యమని వారిపై ప్రేమను చూపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని చెప్పాల్సిన  ఓ మంత్రే ఇలా తమ పేరుచెప్పుకొని మరీ తప్పు చేయండని చెప్పడం ఏంటని పలువురు మండిపడుతున్నారు.

ఒకపక్క కేంద్రంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన వాహన చట్టం అన్ని రాష్ట్రాలలో అంతో ఇంతో అమలవుతున్నా ఏపీలో మాత్రం ఆ ఊసేలేదు. మరోపక్క ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీ వారికి, ఆ పార్టీ కార్యకర్తల కోసమే పనిచేస్తున్నట్లుగా ఉందని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

మరో పక్క మంత్రి సొంత నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి వస్తేనే భవిష్యత్ ఉంటుందని బహిరంగంగానే బెదిరిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి స్వయంగా సీఎం ముందే జగన్ ఫోటో పెట్టుకుంటే ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టరని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.

మొన్నటికి మొన్న గ్రామసచివాలయ ఉద్యోగుల నియామకాల కార్యక్రమంలో సీఎం ఎదురుగానే ఉద్యోగాలలో చేరేవారంతా రోజు జగన్ ను దేవుడిలా కొలుచుకోవాలని, ఆయనే దేవుడి బిడ్డని అధికారులు ఆకాశానికి ఎత్తేస్తే వాహనామిత్ర సభలో జగన్ ఫోటో చాలు మిమ్మల్ని ఆపేవాడేలేడని సీఎం ఎదురుగానే ఓ మంత్రి చెప్పడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నట్లుగా ఉందని విశ్లేషకులు మాట.

అధికారంలో ఉన్నాం కనుక తాము చెప్పిందే చట్టం వినాలి అన్నట్లు మారిపోతున్న ఈ తీరు ఎటు వెళ్తుందన్నది అర్ధం కాని విషయం కాగా.. తాము చెప్పిందే శాసనం అనే రీతిలో ప్రజలను శాసించే స్థాయికి వెళ్తుందన్నది ఇలాంటి సంఘటనలే రుజువు చేస్తున్నాయి. తమ నేతను దేవునిగా కొలుస్తారని భజన చేయడం వారికి సబబనేమో కానీ.. చట్టాలకు.. అధికారాలకు విలువన్నది లేకుండా పోతుందని ఈ నేతలకు తెలిసేదెన్నడో!

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   an hour ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   2 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   10 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   10 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle