newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

జగన్ పై 'రాష్ట్ర సాధు హిందూ పరిషత్' యుద్ధం

29-11-201929-11-2019 11:37:19 IST
Updated On 29-11-2019 14:52:13 ISTUpdated On 29-11-20192019-11-29T06:07:19.735Z29-11-2019 2019-11-29T06:07:17.777Z - 2019-11-29T09:22:13.382Z - 29-11-2019

జగన్ పై 'రాష్ట్ర సాధు హిందూ పరిషత్' యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలలో మతాల ఆధారంగా వివాదాలు తక్కువనే చెప్పాలి. ఇందులో కూడా తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో ఇది చాలా స్వల్పంగానే కనిపిస్తుంది. అయితే యావత్ దేశం మొత్తం మీద కూడా ఈ మతాల వివాదం హిందూ-ముస్లిం బేసిక్ మీద జరుగుతుండగా ఇప్పుడు ఏపీలో హిందూ-క్రిస్టియన్ బేసిక్ మీద జరుగుతుండడం వివాదాస్పదంగానే చూడాల్సి వస్తుంది.

దశబ్దాల నుండి తీవ్ర సంక్లిష్టంగా.. అంతకు మించి సున్నతమైన మత వివాదం అయోధ్య సమస్య ఈ మధ్యనే ముగియగా కేంద్రం కూడా ఈ తరహా సమస్యలపై సమయసూర్తితో ఓర్పుతో ముందుకెళ్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంకా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ తరహా వివాదాలు లేనంతగా ఏపీలో హిందూ-క్రైస్తవుల మధ్య తత్సంబంధాలకు బీటలు వారుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్లు కులాలను బేస్ చేసుకొనే రాజకీయాలు నడిచిన ఏపీలో ఇప్పుడు కొత్తగా మతాల మీద కూడా రాజకీయాలను నడిపిస్తున్నారు. ఎవరికి వారు ఓ మతానికి సానుభూతిపరులుగా కలరింగ్ ఇచ్చేందుకు వేసే ఎత్తులు సమాజంలో స్పష్టమయిన చీలికలు తెస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లుగా తీసుకొనే చర్యలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.

ముందుగా రాజకీయ వివాదాల విషయానికి వస్తే టీటీడీలో అన్యమతస్థులు సంఖ్య పెరిగిపోతున్నా ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్వ్యవహరిస్తుందని అరోపణలు వెల్లువెత్తాయి. ఇక అన్యమతస్థుడైన సీఎం శ్రీవారి దర్శనానికి గెజిట్ ఇవ్వకుండా వెళ్లడం మనోభావాలకు సంబంధించిన విషయమైనా వైసీపీ నేతలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మరోవివాదంగా మారింది.

వీటికి తోడు టీటీడీలో మౌలిక వసతుల పేరుతో ప్రసాదంతో పాటు భక్తుల వసతులకు అద్దెలు పెంచడం.. అదే సమయంలో జెరూసలేం యాత్రలకు వెళ్లే క్రైస్తవ భక్తులకు ఆర్ధిక సాయం పెంచడం ప్రతిపక్షాలు తీవ్రంగా దాడికి దిగాయి. కొన్నిచోట్ల గ్రామ సచివాలయాలలోనే క్రైస్తవ ప్రార్ధనలు నిర్వహించడం, గుంటూరులో మూడు దశబ్దాలుగా పూజలందుకున్న దుర్గాదేవి ఆలయాన్ని రాత్రికి రాత్రి కూల్చేయడం వంటి ఘటనలు కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఓ మతానికి కొమ్ముకాస్తున్నట్లుగా ఉదాహరణలుగా చెప్తున్నాయి.

ఇక ప్రతిపక్షమైన బీజేపీ నేతలలో కొందరైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం కూడా క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగకరంగానే విమర్శించారు. అయితే అదంతా రాజకీయ పార్టీల ఆరోపణలు కాగా ఇప్పుడు ఈ వ్యవహారంలో హిందూ సంస్థలు కూడా ఎంటర్ కాబోతున్నాయి. తాజాగా రాష్ట్ర సాధు హిందూ పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో హిందువులను ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న శ్రీనివాసానంద రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే వారికే ఓట్లు వేసే విధంగా చూస్తామని ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు సీఎం జగన్ ను హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదని.. ఇక యుద్ధం తప్పదని ప్రకటించారు. టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగులపై కఠినంగా ఉన్నందుకే సిఎస్ గా ఎల్వీని అడ్డుతొలగించారని శ్రీనివాసానంద ఆరోపించారు.

ఇక రాష్ట్రంలో హిందూ దేవాలయల నుంచి వచ్చే ఆదాయం దేవాలయలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేసిన శ్రీనివాసానంద గుంటూరులో తొలింగించిన అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మాంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటికయినా ఆలోచనలో మార్పు తెచ్చుకోకపోతే హిందువులంతా ఏకమై ముప్పు తేవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరి శ్రీనివాసానంద చెప్పినట్లుగా యుద్ధం వస్తుందంటారా?!

 

 

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   16 minutes ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   27 minutes ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   42 minutes ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   an hour ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   2 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   15 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   16 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle