newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

జగన్ పార్టీకి సినీ గ్లామర్.. వైసీపీలోకి జీవిత, రాజశేఖర్‌

01-04-201901-04-2019 12:34:45 IST
Updated On 01-04-2019 13:41:20 ISTUpdated On 01-04-20192019-04-01T07:04:45.909Z01-04-2019 2019-04-01T07:04:36.892Z - 2019-04-01T08:11:20.179Z - 01-04-2019

జగన్ పార్టీకి సినీ గ్లామర్.. వైసీపీలోకి జీవిత, రాజశేఖర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమావాళ్లు ఏ పని చేసినా దానికో లెక్క ఉంటుంది. సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ఎప్పుడూ ఎవరికీ జైకొట్టరు. ఎప్పుడూ ఎవరితోనూ పేచీ పెట్టుకోరు. మొన్నామధ్య తిరుపతిలో ఫీజ్ రీయింబర్స్­మెంట్ చెల్లించలేదంటూ విద్యానికేతన్ సంస్థల అధినేతగా నటుడు మోహన్ బాబు పెద్ద ఆందోళన చేశారు. సీన్ కట్ చేస్తే ఆ మూడో రోజు లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత బయటికొచ్చి నా అల్లుడు కాబోయే సీఎం అంటూ తిరిగి తన పాత బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు జీవితా రాజశేఖర్ కూడా అంతే.. గతంలో ఈ జంట వైఎస్, వైసీపీల పక్షమే.. మధ్యలో మనస్పర్థలు వచ్చి దూరమై బీజేపీ వైపునకు వెళ్లిపోయారు. 

ఇప్పుడు మళ్లీ జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్‌లో గతంతో పోల్చితే చాలా మార్పు వచ్చిందనీ, రాజశేఖర్ రెడ్డి రాజసం ఉట్టిపడుతోందనీ, జగనే ముఖ్యమంత్రి కావాలనీ ఈ దంపతులు కోరుకున్నారు. ఆ కోరుకోవడం వెనుక ఏదో పశ్చాత్తాపం కూడా కనిపించింది. ముందు నుంచి జగన్‌తోనే ఉండి ఉంటే ఏ విశాఖ నుంచో, రాజమండ్రి నుంచో పోటీ చేసి ఉండొచ్చన్న ఆవేదన వారి మాటల్లో వినిపిస్తుంది. అంటే వీళ్లు గెలిచేది జగనే అని ఒకరకంగా ఫిక్సైపోయే ఇప్పుడు లోటస్‌పాండ్‌కు క్యూ కడుతున్నట్లు భావించాలి.

గతంలో సినీ నటుడు అలీ గానీ, యువ హీరో తనీష్, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్ వీరిలో ఎవరికీ వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ స్వచ్ఛందంగా వచ్చి చేరారంటే.. వైసీపీ విజయం సాధించాక పొందే ప్రయోజనాలపై వీరి దృష్టి ఉందని భావించాలి. లేదంటే ఈ సినీ నటులు ఏ రెమ్యూనరేషన్ ఆశించకుండా ఎప్పుడైనా నటిస్తారా..? 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle