newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జగన్ నోట పవన్ డైలాగ్

06-03-201906-03-2019 17:10:34 IST
Updated On 06-03-2019 18:39:22 ISTUpdated On 06-03-20192019-03-06T11:40:34.248Z06-03-2019 2019-03-06T11:25:21.699Z - 2019-03-06T13:09:22.896Z - 06-03-2019

జగన్ నోట పవన్ డైలాగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో జగన్-పవన్ భిన్న ధృవాలు. వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. అయితే వైసీపీ అధినేత జగన్ నోట ఇవాళ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్ వినిపించింది. ఎన్నికల మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీలతో పోటీ లేదని జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. రెండు పేజీల్లో మేనిఫెస్టోను రూపొందించాలని సూచించారు.

ఆ విషయంలో ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’ అన్నారు జగన్. గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్‌లో ఇదే డైలాగ్ ఎంత ఫ్యామస్ అయిందో అందరికీ తెలుసు. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ ...విలన్‌తో అన్నమాటల్ని పవన్ అభిమానులు ఈసందర్భంగా గుర్తుచేస్తున్నారు. ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ... నాతో ఎవ్వరూ పోటీకి రారు, రాలేరు’ అంటారు పవన్. ఈ డైలాగ్ జగన్ నోట రావడంతో సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. 

ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల విషయంలో ఇతర పార్టీలతో తమకు పోటీ లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తమ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పోటీ పడి.. ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇవ్వడం కాకుండా, అమలు చేసే అంశాలనే నిజాయితీగా వాగ్దాదాలు ఇద్దామన్నారు. మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీలతో పోటీ లేదని తేల్చి చెప్పారు.

మన మేనిఫెస్టో అందరికీ అర్థమయ్యే రీతిలో సూటిగా సంక్షిప్తంగా పొందుపరచాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈనెల 12న విజయవాడలో మరోసారి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle