newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

జగన్ నైతిక విలువల సూక్తులు మాటలకేనా? పాటిస్తారా?

03-11-201903-11-2019 08:46:48 IST
2019-11-03T03:16:48.862Z03-11-2019 2019-11-03T03:16:39.464Z - - 13-08-2020

  జగన్ నైతిక విలువల సూక్తులు మాటలకేనా? పాటిస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణానంతరం ఢిల్లీ పెద్దలకు అడ్డం తిరిగి సొంత కుంపటి పెట్టుకున్నారు. అప్పటి వరకు జగన్ అంటే రాజశేఖరరెడ్డి తనయుడిగా, యువనేతగా మాత్రమే పరిచయమున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ మరణాంతరం ఆయనో పార్టీ అధ్యక్షుడిగా కనిపించారు.

ఇక తండ్రి మరణంతో ఆగిన గుండెల కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలని.. వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలని ఆయన ప్రజాబాట పట్టారు. అప్పుడు ఆయనకు వెళ్లిన ప్రతిచోటా రాజన్న బిడ్డగా నీరాజనాలు పలికారు.

అనంతరం జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు, వేలకోట్ల సంపాదన, ఆయా కేసులలో మరికొందరు నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు, ఐఏఎస్ అధికారులకు హస్తముండడం.. అక్కడ నుండి కేసు సిబిఐకి వెళ్లడం అంతా రాష్ట్ర రాజకీయాలలో చెరగని అధ్యాయమే.

ఆయా కేసులలో సిబిఐ ముమ్మర దర్యాప్తుతో ఎక్కడిక్కడ అయన ఆర్ధిక వ్యవహారాలకు సంకెళ్లు పడడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల జైలు జీవితం.. బెయిల్ మీద బయటకు వచ్చి ప్రతి వారం కోర్టు విచారణ కూడా అయన అభిమానులకు ఇప్పటికీ కళ్ళ ముందు కనిపించే దృశ్యమే.

అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం యాత్ర ఏదైనా.. ప్రచారం ఎన్నికల కోసమే అయినా కొన్ని లక్షల సార్లు చెప్పిన మాట.. నైతిక విలువలు. రాజకీయాలలో నైతిక విలువలు తీసుకొచ్చి.. నీతి, నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే భవిష్యత్తుకు అందిస్తానని సూక్తులు చెప్పేవారు.

మొన్నటి 2019 ఎన్నికల ప్రచారంలో అయితే నైతికత అనే పదాన్ని ఓ ప్రవచనం మాదిరిగా ఊరూ వాడా తిరిగి చెప్పారు. ఆ దేవుడి దయతో మనం అధికారంలోకి వస్తే భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన రాజకీయాలను పరిచయం చేస్తామన్నారు.

ఇక ప్రస్తుతానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి. కనుకే తాను కోర్టు విచారణకు హాజరైతే ప్రజలకు మంచిది కాదని వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరినా దానివెనుక అర్ధం మాత్రం ఓ సీఎం కోర్టు బోనులో విచారణ ఎదుర్కోవడం చిన్నతనంగా భావించడమేనని మేధావుల మాట.

అందునా ఆ కేసులేమీ చిన్నవి కాదు.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్లు దోచుకున్నారనే కేసులు.. పుస్తకాల కొద్దీ సిబిఐ దాఖలు చేసుకున్న ఛార్జీషీట్లున్న కేసులు. అందుకే జగన్ మినహాయింపు కోరారు.

కానీ సిబిఐ మాత్రం ససేమీరా తప్పదని తెల్చిపారేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ప్రతిశుక్రవారం సిబిఐ కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉంది.

ఇంతవరకూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు బోనులో నిలబడలేదు. అందునా వేలకోట్ల అవినీతి కేసులలో సీఎం హోదాలో ఎవరూ విచారణ ఎదుర్కొనలేదు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి సవాల్ లాంటి విషయమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లిన ప్రతిచోటా మాట తప్పం.. మడమ తిప్పం అనే మాటను పదేపదే చెప్పారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలను పరిచయం చేస్తానని ప్రజలకు మాట ఇచ్చారు.

మరి ఇప్పుడు ఏపీ ప్రజల ముఖ్యమంత్రిగా ప్రతిశుక్రవారం కోర్టు బోనులో విచారణకు నిలబడం నైతికత అవుతుందా? అన్నది విశ్లేషకుల వాదన. ఆదర్శవిలువల రాజకీయ సూక్తులును చెప్పిన జగన్ ఓ సీఎంగా అవినీతి కేసులలో కోర్టు బోనులో నిలబడడం ఆదర్శమని చెప్తారా? లేక ఆయన పదవి నుండి వైదొలిగి సచ్చీలత నిరూపించుకొని మళ్ళీ పదవిని చేపడతారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ చెప్పిన సూక్తులు మాటలకేనా? లేక పాటిస్తారా?!!

 

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   7 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   8 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   8 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   10 hours ago


తూర్పుగోదావరి  వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

తూర్పుగోదావరి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

   10 hours ago


కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడికెళ్లాలి?

   15 hours ago


బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్...పోలీసుల సీరియస్

   15 hours ago


సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్, మంత్రి విశ్వరూప్‌పై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు

   15 hours ago


రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

రచ్చరేపిన ఒక్క సోషల్ మీడియా పోస్టు ..ముగ్గురు మృతి

   15 hours ago


మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. అకౌంట్లో 18వేలు జమ

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle