newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

జగన్ నెక్స్ట్ టార్గెట్ మంగళగిరి టీడీపీ ఆఫీస్..!

14-10-201914-10-2019 10:44:02 IST
Updated On 14-10-2019 12:31:17 ISTUpdated On 14-10-20192019-10-14T05:14:02.515Z14-10-2019 2019-10-14T05:13:59.827Z - 2019-10-14T07:01:17.271Z - 14-10-2019

జగన్ నెక్స్ట్ టార్గెట్ మంగళగిరి టీడీపీ ఆఫీస్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ప్రభుత్వంలో తొమ్మిది కోట్లతో ప్రజల స్పందన, ఫిర్యాదులను తెలుసుకొనేందుకుగా ప్రత్యేకగా నిర్మించి ప్రజావేదికగా పేరుపెట్టిన భవనం ఇప్పుడు లేదు. ఇప్పటి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని ముక్కలు చేసి చరిత్రలో కలిపేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణం ఉందని, అందులో కూర్చొనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూల్చేయండని ఆదేశించారు. ఇరవై లక్షలుపైగా ఖర్చు చేసి మరీ ప్రజావేదికను నామరూపాల్లేకుండా చేసింది.

ఆ భవనాన్ని ప్రతిపక్ష నేత హోదాలో తనను రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే ప్రజానీకాన్ని కలుసుకునేందుకు ఆ భవనాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబు కోరినా అందుకు సమాధానం కూడా లేకుండానే కూల్చేశారని టీడీపీ నేతలు అప్పుడే ఆరోపించారు.

ఒక్క ప్రజావేదిక మాత్రమే కాదు. కరకట్ట మీదున్న అక్రమ కట్టడాలన్నీ తొలగించాల్సిందే.. ప్రజా వేదిక అందుకు సూచన మాత్రమేనని ప్రభుత్వం పెద్దలు అప్పుడు చెప్పుకొచ్చారు. కరకట్ట మీద ఉన్న అన్ని భవనాలకు పలుమార్లు నోటీసులుకూడా ఇచ్చారు. చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయకపోతే తామే ఖాళీ చేయిస్తామన్నారు. అయితే అవన్నీ నోటీసులకు, హెచ్చరికలకు మాత్రమే పరిమితమైంది. కరకట్ట మీదున్న కొందరు కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. మొత్తంగా అంతా చేసి చివరికి జగన్ సర్కార్ అక్కడ చేయగలిగింది ప్రజావేదిక కూల్చివేత ఒక్కటే. ప్రజల సొమ్ము కనుక అడిగేదెవడు?

ముందుగా ప్రజావేదిక.. ఆ తరువాత చంద్రబాబు నివాసమున్న భవనం చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా మంగళగిరికి మార్చారు. జగన్ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనంగా కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో ప్రధాన కార్యాలయం ఉండాలన్న టీడీపీ మంగళగిరి సమీపంలో 4.51 ఎకరాల్లో నిర్మాణం చేపట్టింది. మొత్తం మూడు భవన సముదాయలతో గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన నిర్మాణం మరో నెలలో పూర్తవుతుంది. ఇప్పటికే టీడీపీ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా ప్రభుత్వం ఆ కార్యాలయాన్ని కూల్చేస్తామని నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ పోరంబోకు స్థలంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల స్థలాన్ని కూడా ఆక్రమించుకొని ఆ నిర్మాణం చేశారని.. వారంలోగా వాళ్ళే నిర్మాణాన్ని కూల్చేయకపోతే ప్రభుత్వమే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించింది. దీంతో అవాక్కవడం టీడీపీ నేతల వంతైంది. ఎలాంటి వివాదాల్లేని భూమి, అందునా అన్ని అనుమతులతోనే నిర్మాణం చేస్తున్నామని, కేవలం అధికారదుర్వినియోగం చేసి కక్ష్య సాధింపుకే ప్రభుత్వం ఈ చర్యకు దిగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా నిజానికి ఒకవేళ అక్రమ నిర్మాణమే అయినా దానికి ఓ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా అధికారులు అక్రమాలు ఉన్నాయో లేదో.. అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. అందుకోసం భవన యజమానులను వివరణ అడగాలి. కానీ ఇక్కడ ఏకంగా కూల్చేస్తామని తహసీల్దార్ ఓ గోడకి నోటీసు అంటించేశారు. అది కూడా ఓ వారం గడువు. ఇంతకీ ఇది అక్రమమని, ప్రైవేట్ రైతుల స్థలమని ఎవరు ఫిర్యాదు చేసారంటే సాక్షాత్తు సాక్షి పత్రిక.

సదరు తహసీల్దార్ గారు నోటీసులు జారీ చేసేందుకు రెండు రోజుల ముందు సాక్షి పత్రికలో 'అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం' అంటూ ఓ కథనం రాసుకొచ్చారు. రెవిన్యూ అధికారులు దీన్నే ఫిర్యాదుగా తీసుకుని నోటీసులు జారీ చేసినట్లుగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజావేదికతో మొదలైన కూల్చివేత పరంపర కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలైందని ఇప్పటికే ప్రజలలో ఓ టాక్ మొదలైంది. అక్రమమో.. సక్రమమో తేల్చేందుకు చాలా తతంగం ఉంది. కానీ ముందు కూల్చేసి తర్వాత తేల్చడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూల్చివేతల రాజకీయంలో మరో ఎపిసోడ్ స్టార్ట్ అనమాట!

 

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   3 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   3 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   3 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   7 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   9 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   12 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   12 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   13 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   14 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle