newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

జగన్ ధిక్కార ధోరణి.. కోర్టుకి రాకుండా ఎన్నాళ్ళు?

22-11-201922-11-2019 16:33:24 IST
2019-11-22T11:03:24.297Z22-11-2019 2019-11-22T10:49:02.312Z - - 15-12-2019

జగన్ ధిక్కార ధోరణి.. కోర్టుకి రాకుండా ఎన్నాళ్ళు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు విచారణ విషయంలో దిక్కరింపు బాటలోనే ఉన్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది. జగన్ పాదయాత్ర సమయంలో కూడా విరామం ఇచ్చి మరీ కోర్టు విచారణకు హాజరవగా సీఎం అయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు కావాలని కోరగా కోర్టు ససేమీరా కాదు పొమ్మంది. దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఉకింత ఉత్సుకత మొదలయింది.

సీఎంగా జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకు హాజరవుతారా లేదా అన్న చర్చలు కూడా కొనసాగాయి. సిబిఐ కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వడం కుదరదు.. కోర్టుకు రమన్నా ఇప్పుడు మూడు వారాల నుండి ఏవో సాకులు చెబుతూ కోర్టుకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ శుక్రవారం కూడా కోర్టు విచారణకు హాజరుకాలేదు. అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున రాలేదని లాయర్ కోర్టుకి చెప్పారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 1 తో పాటు ఏ 2 అయిన విజయసాయి రెడ్డి కూడా హాజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించి ఒక్క శ్రీనివాసన్ మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నానని చెబితే జగన్ పాలనలో బిజీగా ఉన్నామని న్యాయవాదులు చెప్పారు. అయితే హాజరుకావాలని కోర్టు చెప్పినా బిజీ వలన రాలేమని చెప్పడం ఎన్నో వారాలు కుదిరేపని కాదు.

ఏదొకరోజు కోర్టుకు హాజరుకావాల్సిందే. ఈలోగా న్యాయవ్యవస్థతో గేమ్స్ ఆడడం ఎంతమాత్రం మంచిది కాదన్న భావన న్యాయవర్గాలలో వినిపిస్తుంది. మరోపక్క సిబిఐ అన్నిటిని గమనిస్తుంది. హాజరుమినహాయంపు కుదరదని చెప్పినా డుమ్మా కొట్టడం కేసును కావాలనే ఆలస్యం చేయడం కిందకే వస్తుందని.. ఇందుకుగాను సిబిఐ త్వరలోనే కోర్టును కీలక నిర్ణయాల కోసం అనుమతులు కోరినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు విచారణకు హాజరుకాకుండా కేసును ఆలస్యం చేయాలని చూడడం వలన సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని.. కేసును రోజువారీ విచారణకు కోరే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు రాలేకపోతున్న సీఎం జగన్ అప్పుడు ప్రతిరోజు కోర్టుకి అంటే పర్మినెంట్ గా హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.

ఏదీ కుదరదంటే ఏకంగా బెయిల్ ను రద్దు చేసి విచారణను వేగవంతం చేయాలని సిబిఐ కోర్టును కోరే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా ధిక్కరింపు బాటలోనే వున్నట్లుగా సిబిఐ వర్గాలకు కనిపిస్తున్న జగన్ కేసుల వ్యవహారంలో కీలకపరిణామాలు తప్పవా? వారానికి ఒకసారి అటు పార్టీలో.. ప్రభుత్వంలో కూడా కొంత అలజడి రేపుతున్న ఈ వ్యహారం ఆసక్తిగా మారింది. మరి ఎన్నాళ్ళో.. ఎన్నేళ్లో చూసితీరాల్సిందే.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle