newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జగన్ దెబ్బకు మేలుకున్న కేంద్రం.. పీపీఏల రద్దుకు నో!

08-10-201908-10-2019 16:56:51 IST
2019-10-08T11:26:51.122Z08-10-2019 2019-10-08T11:26:45.341Z - - 31-05-2020

జగన్ దెబ్బకు మేలుకున్న కేంద్రం.. పీపీఏల రద్దుకు నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అవినీతి పరాకాష్టకు చేరుకుందనే ఆరోపణతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో మొదటిసారిగా గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను తిరిగి సమీక్షించాలని నిర్ణయించారు. ఇది గత మూడునెలలుగా తీవ్ర వివాదానికి దారితీసి భారత ప్రభుత్వ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడటంతో కేంద్రం అనివార్యంగా రంగంలోకి దిగి దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పునస్సమీక్ష కేంద్రం ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో తలనొప్పి తెచ్చిపెట్టింది. ఒకసారి కుదుర్చుకున్న ఒప్పందాలను మళ్లీ సమీక్షించే ప్రక్రియకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు మంటగలిసిందని కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు నిజమేననిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.  ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న పీపీఏలను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామనడం, పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలని ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యవహారంపై మొత్తం అన్ని రాష్ట్రాలకూ స్పష్టత ఇవ్వాలని భావిస్తోం ది. పవన, సౌర విద్యుత్తు సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలకు రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కమ్‌లు కట్టుబడాల్సిందేనని ఆదేశాలు జారీచేసే అవకాశం కనిపిస్తోంది. 

ఈ నెల 11, 12తేదీల్లో గుజరాత్‌లో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ప్రధాన అజెండాలో పీపీఏల అంశాన్ని కూడా చేర్చారు. ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి సూచించబోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒప్పందాలను కొన్ని రాష్ట్రాలు పాటించకపోవడంవల్ల పునరుత్పాదక విద్యుత్తు ఉ త్పత్తికి విఘాతం కలుగుతుందని, తద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, పెట్టుబడుల సమస్య కూడా ఏర్పడుతుందని కేంద్రానికి వివరించారు. విద్యుత్తు సం స్థలు కూడా ఆర్థికంగా నష్టపోతాయని, తద్వారా బ్యాంకు రు ణాల తిరిగి చెల్లింపులు నిలిచిపోయి బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదించారు.

 పీపీఏల రద్దుతో తలెత్తిన పర్యవసనాలపై సీఎం జగన్‌కు ఆర్కే సింగ్‌ ఇప్పటికే లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో తలెత్తకుండా చూడటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. 

ఒక్క ఏపీలోనే పలు విద్యుత్తు సంస్థలకు డిస్కమ్‌లు రూ.13,046 కోట్ల మేర బకాయి పడినట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే అనేక రాష్ట్రాలు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడం లేదనే విషయం కూడా కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ అంశాలన్నింటిపైనా విద్యుత్తు శాఖా మంత్రుల సమావేశంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసే అవకాశముందని తెలిసింది.

ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్నే ప్రభావితం చేసి దేశం మొత్తానికి ఒకే విధమైన పాలసీని రూపొందించేందుకు దారి తీస్తోంది. మరి జగన్ ఇకపై విద్యుత్ ఒప్పందాల పునస్సమీక్షను కొనసాగిస్తారా లేక కేంద్రం ఆదేశాలకు కట్టుబడతారా అనేది తేలాల్సి ఉంది.

 

 

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle