newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

జగన్ దాడి వెనుక ‘సంచలనం’

02-01-201902-01-2019 17:28:34 IST
2019-01-02T11:58:34.400Z02-01-2019 2019-01-02T11:58:23.988Z - - 18-07-2019

జగన్ దాడి వెనుక ‘సంచలనం’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. సంచలనం సృష్టించడం కోసమే నిందితుడు శ్రీనివాస్ పక్కా ప్రణాళిక రచించి ఈ దాడికి పాల్పడ్డాడని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా వెల్లడించారు. నిజానికి.. గతేడాది అక్టోబర్ 18వ తేదీనే జగన్‌పై దాడి చేయాలని శ్రీనివాస్ ప్లాన్ వేసుకున్నాడని, కానీ అప్పుడు సాధ్యం కాకపోవడంతో అక్టోబర్ 25న వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో దాడి చేశాడని ఆయన తెలిపారు. 

జగన్‌పై దాడి చేసిన రోజు శ్రీనివాస్ కోడికత్తికి సాన పట్టించాడని, ఉదయం 4.55 గంటలకే అతడు ఇంటి నుంచి బయల్దేరాడని లడ్డా చెప్పారు. ఉదయం 8 గంటల సమయంలో హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని శ్రీనివాస్ చెప్పాడని ఆయన పేర్కొన్నారు. అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అని... ఎంపీ, ఎమ్మెల్యే మాదిరిగా తన వద్దక్కూడా పీఏ అపాయింట్ తీసుకుని రావాలని అతడు చెప్పినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు సిపి తెలిపారు. దాడికి ముందు ఉదయం 9 గంటల టైంలో రెస్టారెంట్‌లో శ్రీనివాస్ కోడికత్తికి సానపెట్టాడని, రెండుసార్లు వేడి నీటిలో స్టెరిలైజ్‌ కూడా చేసినట్లు తేలిందని ఆయనన్నారు. ఎయిర్‌పోర్టులో వైసిపి నేత ధర్మశ్రీతో జగన్‌ మాట్లాడుతున్నప్పుడు... శ్రీనివాస్ ఆయనపై దాడి చేశాడని లడ్డా వివరించారు. నిందితుడు శ్రీనివాస్‌ వెల్డర్‌గా, కేక్‌ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు.

వాస్తవానికి అక్టోబర్ 18నే జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాస్ ప్రణాళిక వేశాడని చంద్ర చెప్పారు. అయితే... అక్టోబర్‌ 17నే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లడంతో అది సాధ్యపడలేదన్నారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ వివరాల్ని గంటల్లోనే చెప్పాల్సి వచ్చిందని కమిషనర్ స్పష్టం చేశారు. జగన్‌పై విషప్రయోగం చేయాలనే ఉద్దేశం శ్రీనివాస్‌కి లేదనే విషయం విచారణలో స్పష్టమైందని... ఈ దాడిపై జగన్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. తాము చెప్పేదాకా ఛార్జిషీట్‌ దాఖలు చేయవద్దని హైకోర్టు చెప్పినట్లు సీపీ చెప్పుకొచ్చారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle