newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

జగన్ తీరుపై పవన్ ఫైర్.. అది త్రిశంకు రాజధాని!

08-01-202008-01-2020 14:39:59 IST
Updated On 08-01-2020 14:07:40 ISTUpdated On 08-01-20202020-01-08T09:09:59.359Z08-01-2020 2020-01-08T07:49:56.712Z - 2020-01-08T08:37:40.001Z - 08-01-2020

జగన్ తీరుపై పవన్ ఫైర్.. అది త్రిశంకు రాజధాని!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతూనే వున్నాయి. 22రోజులుగా రాజధాని గ్రామాల ప్రజలు మహాధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అయినా ప్రభుత్వం తీరుమారకపోవడంపై రైతులు,మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నారని, మంత్రులు,ఎమ్మెల్యేలు   రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు.

చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రాజధాని ప్రాంత రైతులను, మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ ను గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పాపెట్టకుండానే పార్టీనేతలను అరెస్ట్ చేయడం ఏంటని పవన్ ప్రశ్నిస్తున్నారు. 

అమరావతి నుంచి ప్రజా రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారని, విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదన్నారు.  ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనకబాటుతనం ఉందని, వాటిని అభివృద్ధి చేయాలని తాను ఎప్పటినుంచో కోరుతున్నానన్నారు. ఉపాధి కల్పిస్తే వలసలు కూడా ఆగుతాయన్నారు. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు.

రాజధాని అంటే అందరికీ అందుబాటులో వుండాలన్నారు. రాయలసీమవాసులకు విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుందని, వ్యయ ప్రయాసలు తప్పవన్నారు. రాయలసీమ నుంచి విశాఖ వెళ్ళాలి అంటే ప్రయాణం ఎంతో కష్టతరం అన్నారు.

రాజధాని మార్పు అనేది ఉద్యోగులకీ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి, అమరావతి నుంచి విశాఖ పట్నం.. ఇలా ఉద్యోగులు చీటికీమాటికీ తరలివెళ్ళాల్సి రావడం ఇబ్బందికరం అన్నారు. విజయవాడ, గుంటూరులో పిల్లల్ని చదివించుకుంటున్న ఉద్యోగులు మళ్లీ విశాఖ వెళ్ళాల్సి రావడం దారుణం అన్నారు.

అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతుందన్నారు.  రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దంపట్టిందన్నారు. ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు పెల్లుబుకుతాయన్నారు జనసేన అధినేత పవన్. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle