newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

జగన్ తరపున రంగంలోకి దిగిన కురువృద్ధ జర్నలిస్టులు

03-11-201903-11-2019 15:23:34 IST
2019-11-03T09:53:34.859Z03-11-2019 2019-11-03T09:53:29.869Z - - 27-01-2020

జగన్ తరపున రంగంలోకి దిగిన కురువృద్ధ జర్నలిస్టులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధార వార్తలు ప్రచురిస్తే మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు పెడతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో జాతీయ వ్యాప్తంగా మీడియా వర్గాల్లో కాక పుట్టిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కె రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు అయిన అమర్ హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం హడావుడిగా మీడియాకు కబురంపి ప్రెస్ కాన్పరెన్స్ నిర్వహించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి పబ్లిక్ పాలసీలపై సలహాదారు రామచంద్రమూర్తి అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ప్రెస్ కాన్ఫరెన్సు నిర్వహించడం సంచలనాత్మకంగా మారింది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోపై జాతీయ మీడియా, ప్రెస్ కౌన్సిల్ సైతం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుండగా ఈ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఆ జీవోను గట్టిగా సమర్ధించడం గమనార్హం.  నిరాధార వార్తలు ప్రచురిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న మీడియా సంస్థలపై చర్యలకు తీసుకోవడానికి మాత్రమే ఈ జీవోని తీసుకురావడం జరిగిందని ఈ జర్నలిస్టులిద్దరూ సమర్థించారు.

ఈ జీవో ఉద్దేశం పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఏమాత్రం కాదని కానీ మీడియా తన లక్ష్మణ రేఖను దాటకుండా ఉంచడమే దీని లక్ష్యమని మూర్తి, అమర్ పేర్కొన్నారు. కానీ పత్రికా స్వేచ్చ గురించి దశాబ్దాలుగా పాఠాలు చెబుతూ వచ్చిన ఈ ఇద్దరు కురువృద్ధ జర్నలిస్టులు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడానికి వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం కారణమని తెలుస్తోంది.

వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అమర్, మూర్తి ఇరువురికి కాల్ చేసి ఆగ్రహం ప్రదర్శించారని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ జీవోపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇల్లెక్కి కూస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించకుండా ఏం చేస్తున్నారంటూ జగన్ ఈ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

ఒకవైపు మంత్రులు ప్రభుత్వ జీవోపై వస్తున్న విమర్శలకు వరుసగా సమాధానాలు ఇస్తుండగా ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్న మూర్తి, అమర్ ఇరువురూ ప్రభుత్వాన్ని సమర్థించడం తమ పని కాదన్నట్లుగా నిశ్శబ్దం పాటించడం ఏమిటంటూ జగన్ తీవ్ర అసహనం ప్రదర్సించారని సమాచారం.  మంత్రుల కంటే సీనియర్ జర్నలిస్టులైన మూర్తి, అమర్‌లు  ప్రభుత్వ జీవోను బలపర్చి ఉంటే ప్రభుత్వ నిర్ణయం మరింత విశ్వసనీయతను పొంది ఉండేదని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.

జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్న తర్వాతే అమర్, మూర్తి ఇరువురూ హడావుడిగా ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించడం తెలిసింది. కానీ ప్రభుత్వానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఆధునిక భారత రాజకీయ చరిత్రలో ఏ కారణం చేతనైనా సరే మీడియాపై ఆంక్షలను ఏదో ఒక రూపంలో తీసుకురావాలని, మీడియా విశృంఖలత్వానికి అడ్డుకట్ట పేరుతో మీడియాను అదుపు చేయాలని ప్రయత్నించిన మహా నేతలే తర్వాత వెనుకడుగు వేయక తప్పలేదు. ఇంత చిన్న విషయం వైఎస్ జగన్‌కి అర్థం కాకపోయినా సీనియర్ జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తులంగార్లకు అర్థం కాకపోవడం ఏమిటన్నది సగటు జర్నలిస్టులకు బోధపడటం లేదు. 

ప్రభుత్వ జీవో ఎంతమాత్రం చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ ఈ ఇద్దరు సీనియర్లు ప్రబుత్వానికి సలహా ఇవ్వకుండా జీవో గొప్పతనం గురించి డప్పు కొట్టడం ఏంటన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది.

 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle