newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జగన్ ఢిల్లీ పర్యటనల వెనుక మతలబేంటి?

11-10-201911-10-2019 15:14:30 IST
Updated On 11-10-2019 18:21:07 ISTUpdated On 11-10-20192019-10-11T09:44:30.776Z11-10-2019 2019-10-11T09:43:09.186Z - 2019-10-11T12:51:07.747Z - 11-10-2019

జగన్ ఢిల్లీ పర్యటనల వెనుక మతలబేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాపగ్రస్తుడేమో అనిపించక మానదు. కేంద్రం నుంచి సహాయం కోసం ఆంధ్రప్రజానీకం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్రం కరుణించలేదు. గత అయిదున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఆశ నిరాశల మధ్యే దోబూచులాడుతోందనుకోండి. అప్పుడు చంద్రబాబు వంతయితే, ఇప్పుడు జగన్ వంతు..

చంద్రబాబు 30 సార్లకు పైగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ తాను కోరుకున్న వరాలు కేంద్రం నుంచి రాబట్టుకోలేక నిస్సహాయతతోనే ప్రజల అసమ్మతిని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా ఇలాగే కానుందా.. జగన్ కూడా చంద్రబాబు లాగే ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం లాగా కేంద్రం తలుపులు తడుతున్నా, ప్రధాని నుంచి, అమిత్ షా నుంచి కేంద్ర మంత్రుల నుంచి ఎందరిని కలుస్తున్నా ఏపీకి రావలసిన సహాయం మాత్రం రాలేదు.

ఒక వారం రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ తలుపులు తట్టవలసి రావడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఈ శుక్రవారం కూడా జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనారు కానీ చివరి క్షణంలో తన ఢిల్లీ పర్యటన రద్దయిందని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో జగన్ పర్యటన రద్దయిందని మీడియా వార్త. శుక్రవారం సాయంత్రం కానీ, శనివారం ఉదయం కానీ ప్రధాని నరేంద్రమోదీని కూడా జగన్ కలిసే అవకాశముందని అంతకు ముందు వార్తలు చక్కర్లు గొట్టాయి. 

అక్టోబర్ 5వ తేదీన ప్రధాని మోదీతో ఒకటిన్నర గంటల పాటు సమావేశం అయిన వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబందించి అనేక సమస్యలను ఏకరవు పెట్టి ఏపీకి రూ. 80,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని చేయవలసిందిగా జగన్ ప్రధానిని కోరారు. ఈసారి ప్రధానిని కలిసినప్పుడు తాను త్వరలో ప్రారంభించనున్న వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ప్రారంభోత్సవానికి రావలిసిందిగా జగన్ ప్రధానిని కోరనున్నారు.

రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్థిక సంక్షోభం రీత్యా ఏపీకి తక్షణ ఆర్థిక సహాయం చేయాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించనున్నారని తెలిసింది. అలాగే క్రితం సారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంశాఖమంత్రి అమిత్ షాను కలవాలనుకున్నా సమయం అనుకూలించక కలవలేకపోయిన జగన్ ఈ దఫా పర్యటనలో అమిత్ షాను, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లను కలిసే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‍‌ను కూడా జగన్ కలిసి పోలవరం సమస్యపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అయితే అదికారిక పర్యటన దాని గురించిన సమాచారం వెల్లడి కంటే వారంలోపే ఏపీ ముఖ్యమంత్రి ప్రధానిని రెండుసార్లు కలవనుండడంలోని ఆంతర్యం ఏమిటన్నది అంతు బట్టలేదని పలువురు భావిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle