newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

19-11-201919-11-2019 16:05:16 IST
2019-11-19T10:35:16.614Z19-11-2019 2019-11-19T10:35:03.342Z - - 05-08-2020

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వర్గాలలో తీవ్ర అసంతృప్తిని తెచ్చారు. ఇసుక సరఫరా మీద తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన నిర్మాణ రంగం మీద ఆధారపడిన వ్యాపారుల నుండి కార్మికుల వరకు తీవ్రంగా నష్టపోయారు. అమరావతి విషయంలో కూడా మరో ఐదేళ్ల కాలాన్ని వెనక్కు తీసుకెళ్లారని ఓ మేధావి వర్గం ఇప్పటికే విశ్లేషణలను ప్రభుత్వం మీద నెట్టేసింది.

అక్రమ నిర్మాణల పేరుతో ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తుల కూడా వెనుకాముందు లేకుండా కూల్చివేయాలని ఆదేశాలివ్వడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను తమ పార్టీ ఆస్తులుగా అన్నిటికీ పార్టీ రంగులను వేయించడం వరకు ఎన్నో పనులు ఓ వర్గం ప్రజలలో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక రాష్ట్రంలో మతపరమైన వ్యవహారాలతో పాటు మత మార్పిళ్లకు కూడా సీఎం నిర్ణయాలే కారణమని ప్రతిపక్షంలో మరో వర్గం తీవ్రంగా ప్రచారం చేస్తుంది.

ఆరోపణల సంగతెలా ఉన్నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఇసుక సంక్షోభం లాంటి సమస్యలతో పాటు మీడియా మీద ఆంక్షల జీవో, మరికొన్ని జీవోలను తీసుకొచ్చి మళ్ళీ  వెనక్కు తగ్గడం వంటి పరిణామాలతో ప్రజలలో కొంత వ్యతిరేకత మూటగట్టుకోగా జాతీయ స్థాయి నుండి ప్రాంతీయ మీడియా వరకు ఏకిపారేస్తుంది. ముఖ్యంగా జాతీయ మీడియా భారీ స్థాయిలో జగన్ నిర్ణయాలను ఉతికి ఆరేస్తుంది.

తన నిర్ణయాలతో మీడియా తప్పులను చూపిస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన జగన్ మేనేజ్మెంట్ తెలిసిన కొందరు ప్రముఖులను తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నతపదవులను కట్టబెట్టడంతో పాటు ఆంక్షలు విధిస్తూ జీవోలు తెచ్చారు. కానీ నేషనల్ మీడియా వెనక్కు తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపనున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటివరకు వైసీపీ బరిలో ఉన్న రెండుసార్లు పీకేనే వ్యూహకర్తగా పనిచేశారు. కోట్ల రూపాయలను ఛార్జ్ చేసినా ప్రజల భావాలను తెలుసుకొని, గెలుపే ధ్యేయంగా పనిచేసే ఈ పీకే అండ్ కో ఇప్పటి వరకు పార్టీలను అధికారంలో తీసుకురావడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ అధికార పార్టీపై వచ్చే నెగటివ్ పబ్లిసిటీని తగ్గించే కొత్త బాధ్యతలను కూడా టీంకు అప్పగించనున్నారని ప్రచారం మొదలైంది.

ఢిల్లీ నుండి రాష్ట్రం వరకు మంత్రులపై వస్తున్న ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత మొదలైన అంశాలపై ఈ పీకేటీం పాజిటివ్ వైబ్రేషన్స్ తెప్పించి ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా చేయనున్నాయట. మరి ఇప్పటివరకు ఎన్నికలలో తెరవెనుక ఉండి నడిపించిన పీకే ఇప్పుడు అధికారంలో వచ్చాక కూడా పార్టీలను ప్రభుత్వాలను కాపాడడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle