newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

జగన్ టూర్‌పై ఎందుకింత గందరగోళం?

16-08-201916-08-2019 17:17:27 IST
Updated On 20-08-2019 12:05:35 ISTUpdated On 20-08-20192019-08-16T11:47:27.213Z16-08-2019 2019-08-16T11:47:25.271Z - 2019-08-20T06:35:35.394Z - 20-08-2019

జగన్ టూర్‌పై ఎందుకింత గందరగోళం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పారదర్శకతకు మారుపేరని చెప్పుకునే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటన గందరగోళానికి దారితీసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి .. రెండోసారి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. మొదటి సారిగా.. ఆయన ఇజ్రాయెల్ పర్యటన చేశారు. ఇది తన వ్యక్తిగత పర్యటన అని.. భద్రతా ఖర్చులకు మాత్రమే.. ప్రభుత్వం వద్ద నుంచి రూ. పాతిక లక్షలు నిధులు విడుదల చేసుకున్నారు. అమెరికా పర్యటన విషయంలో మాత్రం.. ఈ ఖర్చులు.. వ్యవహారాలు.. మొత్తం గోప్యంగా వున్నాయి. 

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అన్న ప్రభుత్వ వర్గాలు రాత్రికి రాత్రి.. అధికారిక పర్యటన అన్నారు. ఆయనతో పాటు అధికారులు కూడా పెద్ద ఎత్తున వెళ్లారు. జగన్ టూర్ విషయంలో ఇంత కన్ఫ్యూజన్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్ అమెరికా వెళ్లడానికి కారణం ఆయన రెండోకుమార్తె యూనివర్శిటీ అడ్మిషన్ కోసమని తెలుస్తోంది. కుటుంబసమేతంగా వెళ్లి కూతుర్ని అక్కడ చేర్పించి రావాలని జగన్ నిర్ణయించుకున్నారు. సీఎంగా ఎన్నికయిన తర్వాత తొలి సారి అమెరికా వెళ్తున్నందున.. అమెరికాలోని వైసీపీ అభిమానులు.. ఓ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపించారు. జగన్ ను అమెరికాలో భారత రాయబారి విందుకు ఆహ్వానించారు. 

ఇదంతా ప్రైవేటు కార్యక్రమం అని ప్రకటించారు. అయితే  జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో.. సీఎం హోదాలో..సమావేశాలు, సమీక్షల్లో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 22 వరకు జగన్ అమెరికాలో ఉంటారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు.. ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. ఆగస్టు 17న జరగనున్న ఈ ఆత్మీయ సమావేశంలో అమెరికా నలుమూలల నుంచి, కెనడా నుంచి కూడా తెలుగువాళ్ళు పెద్దసంఖ్యలో హాజరు అవుతారని చెబుతున్నారు. అందుకే తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ అయిన డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ను ఎంపికచేశారు. జగన్‌తో పాటు అమెరికా వెళ్లే బృందంలో కొత్తగా పలువురు నేతలు చేరారు. సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా వెళ్లారు. ముఖ్యమంత్రితో జరిగే కొన్ని పలు కీలక సమావేశాల్లో మంత్రి సురేష్ పాల్గొంటారు.

అక్కడ విశ్వ విద్యాలయాల్లో సంస్కరణల పైన అధ్యయన బాధ్యతను మంత్రి సురేష్ కు అప్పగించారు. అదే విధంగా అమెరికాలో శ్రీవారి ఆలయాల నిర్మాణం పైన కొద్ది రోజులుగా ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. దీని పైన అక్కడి ప్రతినిధులతో వైవీ సుబ్బారెడ్డి చర్చిస్తారు. ఇదిలా ఉంటే జగన్ టూర్ కోసం ఎంత ఖర్చుపెడుతున్నారనేది ఇంకా జీవో విడుదలచేయలేదు. జగన్ అమెరికా పర్యటన వివరాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని కొంతమంది విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle