newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

18-11-201918-11-2019 14:26:58 IST
Updated On 18-11-2019 14:44:53 ISTUpdated On 18-11-20192019-11-18T08:56:58.635Z18-11-2019 2019-11-18T08:56:55.368Z - 2019-11-18T09:14:53.931Z - 18-11-2019

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో రాజకీయం ఇప్పుడు సెగలు, పొగలు రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ విధానాలపై ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడి దాడి చేస్తుంటే అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని టార్గెట్ చేసి దెబ్బతీస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇసుక దీక్షకు కూర్చున్న రోజునే ఆ పార్టీ యువనేత అవినాష్ కు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.

అప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ అధిష్టానం మీద ప్రత్యక్ష ఆరోపణలకు దిగారు. అక్కడ నుండే ఈ వివాదం కాస్తా ఆరోపణలు, ప్రత్యారోపణలు మించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. వీళ్ళకి తోడు మంత్రి కొడాలి నాని మాజీ సీఎం చంద్రబాబు, కుమారుడు లోకేష్, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి కొందరు నేతలను కూడా నోటికి వచ్చినట్లుగా దూషించారు.

ప్రభుత్వంలో రెడ్డి, కాపు మంత్రులున్నా కేవలం కమ్మ సామజిక వర్గానికి చెందిన మంత్రులతో పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ నేతలపై విమర్శలు, దూషణలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ సీఎం జగన్ చిటికేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటో తెలుసా అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా కొందరు విశ్లేషకులు దీనిపై చర్చలు జరుపుతున్నారు.

ఇంతకీ అసలు జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది? మహా అయితే పది లేదా పదహైదు మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరడమో లేక ఎమ్మెల్యేలుగా కూడా రాజీనామాలు చేయడమో జరుగుతుంది. అంతకు మించి ప్రజాస్వామ్యంలో చిటికలేసి వ్యక్తిగతంగా చంద్రబాబును ఏమీ చేయలేరన్నది విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ సర్కార్ ఏర్పడిన ఐదు నెలలుగా చంద్రబాబు, లోకేష్ మీద ఎన్నో ఆరోపణలు చేసినా.. గత ప్రభుత్వ విధానాలలో లొసుగులు వెతికినా ఎక్కడా ఆధారాలు దొరకలేదని, అదే దొరికితే వ్యతిగతంగా కూడా చంద్రబాబు ఇబ్బందులు పడాల్సి వచ్చేదంటున్నారు. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం అధికారుల మీద అసహనం కూడా వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

కనుక ఇప్పుడు సీఎం జగన్ చిటికేస్తే టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో కొందరు పార్టీని వీడవచ్చు. అదే సమయంలో బీజేపీ నేతలు చిటికేసినా అదే జరుగుతుంది. కానీ బీజేపీలోకి వెళ్లకుండా చిటికేసి ఆపే సత్తా మాత్రం సీఎంకు ఉండదంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు చిటికలేసినా నేతలు పార్టీలు మారతారని.. అంతమాత్రాన ప్రజలు, కార్యకర్తలు మారాలని లేదంటున్నారు.

అదే నిజమైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు చిటికేస్తే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని.. అంత మాత్రాన ప్రజలు టీడీపీలోకి వెళ్లలేదని, అందుకే ఇప్పుడు వైసీపీ భారీ స్థాయి విజయాన్ని అందుకుందన్నారు. అలానే ఇప్పుడు కూడా చిటికెలతో ప్రజలను మార్చలేరని నేతలు గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

ఇంకా చెప్పాలంటే కేంద్రంలో మోడీ-షా ద్వయం చిటికేస్తే సీఎం జగన్ కు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కనుక నేతలెవరైనా చిటికలేస్తే, కళ్ళు తెరిస్తే, ఒక్క చూపు చూస్తే, తొడ గొడితే లాంటి మాటలను కట్టిపెట్టి ప్రజల అవసరాలను తీరిస్తే విజయాలను నిలుపుకోవచ్చని సూచిస్తున్నారు.

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle