newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జగన్ గృహప్రవేశం.. బాబు విమర్శల పర్వం

27-02-201927-02-2019 16:08:21 IST
Updated On 27-02-2019 16:12:06 ISTUpdated On 27-02-20192019-02-27T10:38:21.495Z27-02-2019 2019-02-27T10:38:16.930Z - 2019-02-27T10:42:06.268Z - 27-02-2019

జగన్ గృహప్రవేశం.. బాబు విమర్శల పర్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు వైసీసీ అధినేత. విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. 

Image may contain: house, sky and outdoor

ఎప్పటినుంచో జగన్ స్వంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకున్నారు. ఈనెల 14నే ఈ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. అయితే, షర్మిల దంపతులు  అనారోగ్యంతో బాధపడుతుండడం, జగన్ లండన్ ప్రయాణం నేపథ్యంలో వాయిదా పడింది. ఫిబ్రవరి14న జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. జగన్ గృహప్రవేశంలో కేసీఆర్ పాల్గొంటారని ప్రచారం కూడా జరిగింది. 

సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం చంద్రబాబు ఏపీలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోగా, జనసేన అధినేత పవన్ సైతం ఇల్లు, కార్యాలయం ఒకేచోట నిర్మించుకున్నారు. తాజాగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా తన నివాసాన్ని రాజధాని పరిధిలో ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇక నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ అమరావతి కేంద్రంగా నిర్వహించనున్నారు. దీంతో ప్రధాన పార్టీ అధినేతల అమరావతి షిఫ్టింగ్ సంపూర్ణమయింది. 

Image may contain: 1 person, standing and indoor

వైఎస్‌ జగన్‌కు అధికారం అప్పగిస్తే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని టీడీపీ నేతలు మీడియా చేసిన ప్రచారం అబద్ధమని...అమరావతిలో వైఎస్‌ జగన్‌ స్థిర నివాసం, పార్టీ కార్యాలయ నిర్మాణాలతో అబద్ధమని తేలిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టిన చంద్రబాబు రాజధానిలో స్థిర నివాసం అంశాన్ని ఎందుకు కాపీ కొట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో బాబు హైదరాబాద్‌లో ఉన్న సొంతింటికి చేరుకుంటారని ఆమె జోస్యం చెప్పారు.

ఇదిలా ఉంటే జగన్ గృహప్రవేశంపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నాలుగేళ్లుగా మన గడ్డ మీద నుంచే పాలన సాగిస్తున్నామని, అందరికీ అందుబాటులో రాష్ట్ర నడిబొడ్డున అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్యాలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడని, ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే జగన్ బస చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్ల పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. 

Image may contain: one or more people


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle