newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

జగన్ గూట్లో పవన్ కోవర్టు..?

05-01-201905-01-2019 17:04:29 IST
2019-01-05T11:34:29.368Z05-01-2019 2019-01-05T11:34:27.696Z - - 27-05-2020

జగన్ గూట్లో పవన్ కోవర్టు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు కానీ... ఆయన ప్రణాళికలే ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఓవైపు ఇతర పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతుంటే... పవన్ నుంచి మాత్రం ఆ విషయమై ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ‘జనసేన’ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని అంటున్నారే తప్ప... దీనికి సంబంధించిన వివరాలేమీ వెల్లడించడం లేదు. పైగా ఆయన రాజకీయం చాలావరకు ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు.

మరోవైపు... పవన్‌కి ఆప్తమిత్రుడైన కమెడియన్ ఆలీ, వైఎస్ జగన్‌తో కలవడం సంచలనంగా మారింది. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను, ఆయన కాన్వాయ్‌లో ఆలీ కలిశారు. ఆ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. పవన్‌కి ఎంతో సన్నిహితుడు అయిన ఆలీ... ‘జనసేన’లో కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపడం వెనుక  అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం వ్యవహారం చూస్తుంటే... పవనే స్వయంగా ఆలీని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేర్పిస్తున్నట్లు ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో పొత్తు కోసమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవును... తెరముందు ఇద్దరూ రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ దూషించుకుంటున్నారు. కానీ... తెరవెనుక మాత్రం రాజకీయ లబ్ది కోసం కాంప్రమైజ్‌కి వచ్చి, చేతులు కలిపేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి పావుగా ఆలీని రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా... ఎన్నికల్లో టిడిపి, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ సెపరేట్‌గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయం! అందులో ‘జనసేన’కి భారీ ఓట్లు దక్కే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. టిడిపితో దోస్తీ కట్ అవ్వడమే గాక వైరం మరింత పెరిగింది కాబట్టి... వైఎస్సార్ కాంగ్రెస్‌కి దగ్గరవ్వడమే బెటరనుకుని, దాంతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నారట! బహుశా ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేకపోయినా... ఫలితాల్ని బట్టి చేతులు కలపాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ... వైఎస్సార్‌సిపికి ఆలీ దగ్గరైతే తమ దోస్తీకి రూటు క్లియర్‌ అవుతుందని భావిస్తున్నారు. మరి... ఇది ఎంతవరకు నిజమో తేలాలంటే, మరికొద్దిరోజులు ఆగాల్సిందే!

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle