జగన్ గుడ్ న్యూస్.. మందుబాబుల చిందులే
08-08-202008-08-2020 09:46:00 IST
Updated On 08-08-2020 09:55:39 ISTUpdated On 08-08-20202020-08-08T04:16:00.109Z08-08-2020 2020-08-08T04:15:38.010Z - 2020-08-08T04:25:39.264Z - 08-08-2020

ఏపీలో జగన్ తీసుకోబోతున్న నిర్ణయం మందుబాబుల పాలిట వరంలా మారనుందా? అంటే అవునంటున్నారు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా మద్యం ధరలు ఆకాశాన్నంటాయి. తెలంగాణలో కంటే డబుల్ రేట్లు వున్నాయి. దీంతో రోజూ వందలాది బాటిల్స్ ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడుతున్నాయి. దీంతో ప్రభుత్వ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఈమధ్యే విశాఖలో ఓ కొరియర్ కంపెనీపై దాడి చేసి కొరియర్ ద్వారా మద్యం అక్రమ రవాణా సాగుతోందని ఓ ముఠా గుట్టుని రట్టుచేసిన సంగతి తెలిసిందే. మద్యనిషేధం వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం అమ్మకాలు తగ్గిస్తామని పేర్కొంది. జగన్ ఆశించినట్టుగానే ఏపీలో మద్యం అమ్మకాలు చాలా మటుకు తగ్గాయి. కానీ ఆస్థానంలో ఇతర రాష్ట్రాల మద్యం ఏపిలోకి వచ్చిపడుతోంది. ఈనేపథ్యంలో మందుబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందంటున్నారు. మద్యం ధరలు ఎక్కువగా వుండడం, లాక్ డౌన్ వల్ల కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుండడంతో ఇలాంటి వాతావరణాన్ని మార్చడానికి ఏపీలోనే మద్యం ధరలు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ కారణాలతో మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం మేర మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి అది కాస్త ఇంకో ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నట్టు కనిపించింది. శానిటైజర్ మరణాలు పెరుగుతుండటంతో ఆ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోందట. వారంలో మద్యం ధరల తగ్గింపు నిర్ణయం వెలువడనుంది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా