newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

జగన్ కోసం త్యాగం... వదినపై పోటీ

16-03-201916-03-2019 08:22:22 IST
Updated On 16-03-2019 08:23:10 ISTUpdated On 16-03-20192019-03-16T02:52:22.206Z16-03-2019 2019-03-16T02:52:17.812Z - 2019-03-16T02:53:10.536Z - 16-03-2019

జగన్ కోసం త్యాగం... వదినపై పోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల వేళ వైఎస్ జగన్ కుటుంబానికి తీరని శోకం కలిగింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. ముందు ఆయనది గుండెపోటు అని భావించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో నివ్వెరపరిచే విషయాలు బయటకు రావడం హతాశుల్ని చేసింది. వివేకాని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత గుండెపోటు రావడంతో స్టెంట్లు వేయించుకున్నారు. విలక్షణమయిన, ముక్కుసూటి తనం కలిగిన తమ అభిమాన నేత రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు వారు చేసుకుని కుమిలిపోతున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. వైసీపీ అధినేత జగన్‌కు ఆయన స్వయానా బాబాయి. వైఎస్‌తోపాటు కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితాన్ని వివేకానందరెడ్డి ప్రారంభించారు. 1999లో కడప ఎంపీగా ఆయన గెలిచారు. 2004లో కూడా ఎంపీగా గెలిచి కడప ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో.. ఆ సీటును త్యాగం చేశారు. 2009లో జగన్ కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదే ఏడాది వివేకాను ఎమ్మెల్సీ పదవి వరించింది. ఆ తర్వాత హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.

కాంగ్రెస్ నుంచి రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రులయ్యారు. 2010లో కిరణ్ కేబినెట్‌లో వైఎస్ వివేకానందరెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత రెండేళ్లకే కాంగ్రెస్‌కు జగన్ గుడ్‌బై చెప్పారు. వైఎస్ పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తిలోదకాలిస్తోందంటూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. స్వయానా అన్న కుమారుడు సొంత పార్టీ పెట్టుకున్నా.. వైఎస్ వివేకా కాంగ్రెస్‌ను మాత్రం వీడకపోవడం అప్పట్లో సెన్సేషన్ అయింది.

జగన్‌కు మద్దతుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో ఆ ఏడాది ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో తన బలమెంతో నిరూపించాలని వైఎస్ వివేకా నిర్ణయించుకున్నారు.

పులివెందులలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2011లో వచ్చిన ఉప ఎన్నికల్లో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి బరిలోకి దిగారు. కన్నతల్లి లాంటి వదినపై పులివెందులలో పోటీకి దిగడం ఏంటని అంతా ప్రశ్నిస్తే.. వైఎస్ వివేకా ఘాటుగానే సమాధానమిచ్చారు.

 ‘పులివెందులలో పోటీ చేయడం ద్వారా మంత్రి పదవిలో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. పులివెందుల ప్రజలకు సమాధానంగా ఉండాలనే పోటీ చేస్తున్నా. కుటుంబం గురించి బాధపడేకంటే.. ప్రజలకోసం పనిచేయాలనే అనుకున్నా. ఈ సెంటిమెంట్లతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే.. మేమూ చేయాల్సి వస్తుంది.

కొడుకు లాంటి నా మీద వదిన పోటీ చేయడమేంటని మేమూ అనాలి. సెంటిమెంట్లు లేవు.. రాజకీయాలు రాజకీయాలే...’ అని నాడు వివేకానందరెడ్డి  కుండబద్ధలు కొట్టారు. 

ఆనాటి ఉప ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీలోకి ఆయన చేరడం వెంటవెంటనే జరిగిపోయాయి. కడప జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వివేకా హాజరయ్యేవారు. నేతలు, కార్యకర్తల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అందరితో ఇట్టే కలిసిపోయేవారు వివేకా. ఆయన లేని లోటు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా జిల్లా వాసులకు పూడ్చలేని లోటుగానే చెబుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle