newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జగన్ కొత్త ఒరవడి.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు

07-06-201907-06-2019 12:24:17 IST
Updated On 24-06-2019 15:13:34 ISTUpdated On 24-06-20192019-06-07T06:54:17.795Z07-06-2019 2019-06-07T06:54:15.941Z - 2019-06-24T09:43:34.325Z - 24-06-2019

జగన్ కొత్త ఒరవడి.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కొత్త మంత్రివర్గం ఎలా ఉంటుందో, ఎవరికి పదవులు దక్కుతాయోనని అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ శనివారం కొలువుదీరనుంది. శనివారం ఉదయం 11.49గంటలకు సచివాలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అయితే, జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ  సీఎంలు ఉంటారని తెలుస్తోంది. 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నియమించనున్న జగన్‌ ..ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తానని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమావేశంలో తెలిపారు. 

ఉప ముఖ్యమంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు అవకాశం లభించనుంది. మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని జగన్‌ స్పష్టం చేశారు. మరో వైపు మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందోనని ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఏర్పాటుచేయడం కొత్త ఒరవడిగా చెబుతున్నారు.

Image may contain: 6 people, people standing

అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రగతి పెరగాలి. నామినేషన్‌ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు అప్పగిస్తామని జగన్ స్పష్టం చేశారు.  ఈనెల 12న నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 

ఇదిలా ఉంటే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ప్రత్యేక ద‌ృష్టి కేంద్రీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయం సమీపంలోని పార్కింగ్‌ ఏరియాలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మరో వైపు సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయ పనులను వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle