newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

జగన్-కేసీఆర్ చర్చలపై కేశినేని హాట్ కామెంట్లు

29-06-201929-06-2019 09:25:30 IST
Updated On 29-06-2019 13:06:01 ISTUpdated On 29-06-20192019-06-29T03:55:30.025Z29-06-2019 2019-06-29T03:55:07.440Z - 2019-06-29T07:36:01.240Z - 29-06-2019

జగన్-కేసీఆర్ చర్చలపై కేశినేని హాట్ కామెంట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేశినేని నాని.. బెజవాడ ఎంపీగా ఆయన ప్రసిద్ధులు. ఏపీ ఎన్నికలు, ఫలితాలపై చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాని. తాజాగా ఇప్పుడు జగన్-కేసీఆర్ చర్చలపై స్పందించారు. తనదైన రీతిలో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం ఏపీ-తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ డిస్కషన్లకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విభజన సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌, జగన్‌ చొరవను అభినందిస్తున్నానని కేశినేని అన్నారు. అసలు అర్థం కాని ప్రశ్న ఏమిటంటే జగన్‌ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? లేదంటే ఏపీకి సంబంధించిన పెండింగ్‌లో ఉన్నవాటిని సాధిస్తున్నారా? అసలేం జరుగుతోందన్నట్లుగా కేశినేని ఫేస్‌బుక్‌ వేదికగా అనుమానం వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం. 

మరోవైపు ఈ భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Image may contain: 3 people

దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిరాటంకంగా కొనసాగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని.. కావాలంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు కూడా జరుపుతామని ఆయన అన్నారు. ఇరువురు సీఎంల భేటీపై మిశ్రమ స్పందన లభిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle