newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

జగన్ కేబినెట్ తొలి బడ్జెట్.. జనరంజకంగా ఉంటుందా?

12-07-201912-07-2019 08:05:36 IST
Updated On 12-07-2019 10:56:23 ISTUpdated On 12-07-20192019-07-12T02:35:36.682Z12-07-2019 2019-07-12T02:35:33.061Z - 2019-07-12T05:26:23.792Z - 12-07-2019

జగన్ కేబినెట్ తొలి బడ్జెట్.. జనరంజకంగా ఉంటుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేనున్నాను.. నేను విన్నాను... ఈ డైలాగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంతో పేరు తెచ్చింది. మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం ఇవాళ తొలి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది.

ఉదయం 8గంటలకు ప్రత్యేకంగా సమావేశం అయిన ఏపీ కేబినెట్‌‌ 2019-20 వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదించింది. అనంతరం ఆర్ధికమంత్రి బుగ్గన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వైసీపీ మేనిఫెస్టో, ఎన్నికల హామీలు, రైతు సంక్షేమం, నవరత్నాల అమలే లక్ష్యంగా భారీ బడ్జెట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని భావిస్తున్నారు. అయితే వివిధ శాఖల నుంచి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రతిపాదనలు రావడంతో అదే స్థాయిలో భారీ బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా నవరత్నాల అమలుకే 66వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు ఉంటాయి. వైఎస్సార్ ఆసరాకు 7వేల కోట్లు, అమ్మ ఒడికి 4వేల 900కోట్లు, ఫీజు రీఎంబర్స్‌‌మెంట్‌కు 5వేల కోట్లు, , సామాజిక పెన్షన్ల కోసం 15వేల కోట్లు, గృహనిర్మాణానికి 8వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఎంతో కీలకంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి 6వేల 300కోట్లు, అలాగే ముఖ్యమైన హామీల్లో ఒకటైన రైతు భరోసాకు సుమారు 12వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఇక సాగునీటి ప్రాజెక్టుల కోసం 8వేల కోట్లు, రాజధాని నిర్మాణం కోసం 400కోట్లు, ధరల స్థిరీకరణకు 3వేల కోట్లు, అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు, వివిధ కులాల కార్పొరేషన్లకు 3వేల కోట్లు, రైతుల ఉచిత విద్యుత్‌కు 4వేల కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి వెయ్యి కోట్ల మేర వెచ్చించనున్నట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

జగన్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేటాయింపులు ఎలా ఉంటాయోనని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను ఇప్పటికే సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజల సంక్షేమమే టార్గెట్‌గా బడ్జెట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

2020 మార్చి 31 వరకూ ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle