newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

జగన్ కూర్పుతో సామాజిక న్యాయం జరిగిందా?

18-03-201918-03-2019 07:35:10 IST
2019-03-18T02:05:10.635Z18-03-2019 2019-03-18T02:04:54.655Z - - 25-02-2020

జగన్  కూర్పుతో  సామాజిక న్యాయం జరిగిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలోని అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సిట్టింగులకు మళ్లీ సీటు ఇచ్చారు జగన్. ముఖ్యంగా ధర్మాన కుటుంబంలో ఇద్దరికి జాబితాలో చోటు కల్పించారు జగన్.

అలాగే విజయనగరం జిల్లాలో ఇద్దరు సిట్టింగులకు మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

ఎందుకంటే బొత్స కుటుంబానికి చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నుంచి ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల నుంచి బొత్స తోడల్లుడు అప్పలనాయుడికి టిక్కెట్లు ఇచ్చారు జగన్. ఇక విశాఖ జిల్లా విషయానికొస్తే... మాడుగుల సీటు సిట్టింగ్ ఎంఎల్ఏ ముత్యాల నాయుడికే టిక్కెట్ ఇచ్చిన జగన్... పార్టీలో కొత్తగా చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణం టిక్కెట్, అవంతి శ్రీనివాస్‌కు భీమిలి టిక్కెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ చేసిన అమరనాథ్‌కు ఈసారి అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు.

అటు తూర్పు గోదావరి జిల్లా అంశానికి వస్తే... ఇద్దరు సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్లీ టిక్కెట్ ఇచ్చిన జగన్... టిక్కెట్ వస్తుందా, రాదా అన్న అనుమానంతో ఉన్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మండపేట టిక్కెట్ ఇచ్చారు.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు జగన్. ఈసారి క్షత్రియ, కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కాపులకు ఐదు, క్షత్రియులకు మూడు, వెలమలకు ఒక టిక్కెట్ ఇచ్చారు.

ఇక కృష్ణా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంఎల్ఏలకు మరోసారి అవకాశం ఇచ్చారు జగన్. కాపు సామాజికవర్గానికి నాలుగు, కమ్మ సామాజిక వర్గానికి నాలుగు, బీసీలకు రెండు, వైశ్య, బ్రాహ్మణ, ముస్లిం, వెలమలకు ఒక్కో టిక్కెట్ ఇచ్చారు జగన్. గుంటూరు జిల్లాలో కూడా నలుగురు సిట్టింగులకు సీట్లు మరోసారి ఇచ్చారు జగన్. అయితే పొన్నూరు సీటు విషయంలో సీన్ మారింది. మొదటి నుంచీ తనకు టిక్కెట్ ఖాయమని భావించిన రావి వెంకట రమణను పక్కనపెట్టి... కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోశయ్యను బరిలో దించారు జగన్. ఇదొక సరికొత్త సామాజిక ప్రయోగంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ప్రకాశం జిల్లాలో ఒకే ఒక సిట్టింగ్ ఎంఎల్ఏకు టిక్కెట్ ఇచ్చిన జగన్... టీడీపీని శాసించే అభ్యర్ధులను బరిలోకి దించినట్లు అర్థం అవుతోంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఆరుగురు సిట్టింగులకు టిక్కెట్లు కేటాయించారు జగన్. అలాగే కర్నూలు జిల్లాలో నలుగురు సిట్టింగులతో పాటు పార్టీలో కొత్తగా చేరిన ముగ్గురుకి టిక్కెట్లు ఇచ్చారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎంఎల్ఏను మార్చి కొత్త వారికి టిక్కెట్ ఇచ్చారు.

అటు అనంతపురం జిల్లాలో ఒక సిట్టింగ్ ఎంఎల్ఏకే టిక్కెట్ ఇచ్చిన జగన్... అనంతపురం అర్బన్ సీటులో సిట్టింగ్ ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరికి పోటీగా అనంత వెంకట్రామిరెడ్డిని బరిలో దింపారు.

ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎంఎల్ఏలకు మరోసారి టిక్కెట్ ఇచ్చిన జగన్... పూతలపట్టు, మదనపల్లిలో సిట్టింగ్ ఎంఎల్ఏలను పక్కన పెట్టారు. ఇక జగన్ సొంత జిల్లా కడపలో ఏడుగురు సిట్టింగ్ ఎంఎల్ఏలకు ఈసారి మళ్లీ టిక్కెట్ ఖరారు చేశారు జగన్. గత ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి, కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎంఎల్ఏ మేడా వెంకట మల్లికార్జున రెడ్డికి అదే స్థానాన్నికేటాయించారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపించారు జగన్.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle