newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జగన్ కు ఫ్రీ..ఫ్రీ

07-02-201907-02-2019 12:38:38 IST
2019-02-07T07:08:38.608Z07-02-2019 2019-02-07T07:08:36.019Z - - 17-07-2019

జగన్ కు ఫ్రీ..ఫ్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు జగన్‌దే హవా అంటూ సర్వేలు ఊదరగొడుతుంటే మరోవైపు ఆయన అనుకూల మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన గెలుపునకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించిన కథనాలే ప్రత్యక్షమవుతున్నాయి. 2014లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపించింది. అప్పట్లో జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు అవసరానికి మించి ఖర్చు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మితిమీరిన ఖర్చుతో అప్పులపాలై ఈసారి ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్న వ్యక్తులూ ఉన్నారు. జగన్ ఇవేవీ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. తన నిర్మొహమాటపు స్టయిల్లో అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. కాదనుకున్న వాళ్లకి మొహం మీదే చెప్పేస్తున్నారు. ఆయన ఈ పద్దతిని మార్చుకోవాలన్నది అనుకూల మీడియా ఇస్తున్న ఉచిత సలహా. 

అదలా ఉంచితే కులాలవారీగా పార్టీల తోకలు పట్టుకుని విడిపోతున్న జనాల్ని చూసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పతనావస్థ కనిపిస్తుంది. తెలుగుదేశాన్ని కమ్మ సామాజిక వర్గపు పార్టీగానూ, జగన్ పార్టీని రెడ్ల పార్టీగానూ, పవన్ కళ్యాణ్ పార్టీని కాపుల పార్టీగా జనం గుర్తించడం కనిపిస్తుంది. ఇటువంటి భావం కలగడానికి ఆయా పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు కారణం. దీనికి తోడు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో కమ్మ కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చిందంటూ తప్పుడు గణాంకాలతో ఇటీవల ఎవరో జగన్ని బురిడీ కొట్టించారు. ఆయన ఏమాత్రం ప్రామాణికతల్లేని పత్రాలని తీసుకుని ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. అసలు ఎన్నికల కమిషన్‌కు ఈ వ్యవహారంతో ఏం సంబంధం? పోనీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటే అది ఉల్లంఘన జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడా పరిస్థితీ లేదు. సమయం సందర్భం లేకుండా తప్పుడు సమాచారంతో జగన్ని కావాలనే ఎవరైనా దారి తప్పించారేమోనంటూ ఆ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.

తీరా జగన్ ఈ తప్పుడు వివరాలను పార్టీ ద్వారా ప్రకటన కూడా విడుదల చేయడం... దానికి ఏపీ ప్రభుత్వ ఖండన రావడంతో జగన్ మాటల్లో విశ్వసనీయత దెబ్బతిన్నది. ఇక రెండ్రోజుల నుంచీ ఇటువంటి వివరాలతోనే కమ్మ సామాజిక వర్గాలకు పెద్ద పీట అంటూ విశ్వవిద్యాలయాల వార్త ఇంకొకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చివరకు అది కూడా తప్పని తేలిపోయింది. 

ఇటీవల బీసీ సామాజిక వర్గాలకు పథకాల్ని రచించడానికి జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారని అందులో పాల్గొన్న మొత్తం వ్యక్తులందరూ రెడ్లే అంటూ పేర్లతో సహా ఒక వార్త షికార్లు కొట్టింది. అది నిజంకాకపోయినా ఆయన పార్టీలో లెక్కకు మించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లంతా జగన్ చుట్టూ కనిపిస్తారు. ఇదంతా ఖచ్చితంగా ఆయనకు అనుకూలించే విషయం కాదంటూ మరో సలహా ఇచ్చారు. చంద్రబాబునాయుడు చుట్టూ కూడా కొంతకాలంక్రితం దాకా ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడాయన అటువంటి వాళ్ళను బహిరంగంగా కలవడానికి పెద్దగా ఇష్టపడడంలేదు. అయితే  అటువంటి ముద్రలు పడిపోయిన తరువాత ఇప్పుడు ఏం చేస్తే ఏం ప్రయోజనం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమే అవుతుంది. 

ఇటువంటి సలహాల్లో కొంత వాస్తవికత కనిపించినా.. అక్కడ  జగన్ గెలుపుపట్ల ఆసక్తులు కన్నా చంద్రబాబుపట్ల వాళ్లలో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహాలు ఇటువంటి రాతలకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. సర్వేలన్నీ అతనికి అనుకూలమే కావచ్చు. అవి జనాభిప్రాయాల్ని ప్రతిబింబించవచ్చు. కానీ ఎన్నికలనాటికి పరిస్థితిలో మార్పు ఉండవచ్చు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాచికలు అందుకోసం ఆయన వ్యూహాలూ పూర్తిగా వేరేగా ఉంటాయన్న మాటా నిజమే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle