newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

జగన్ కీలక నిర్ణయం... ఇసుక ఫ్రీగా పొందే అవకాశం

26-06-202026-06-2020 08:13:04 IST
Updated On 26-06-2020 10:53:51 ISTUpdated On 26-06-20202020-06-26T02:43:04.134Z26-06-2020 2020-06-26T02:42:58.027Z - 2020-06-26T05:23:51.404Z - 26-06-2020

జగన్ కీలక నిర్ణయం... ఇసుక ఫ్రీగా పొందే అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విప్లవాత్మక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న జగన్ మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నవారికి శుభవార్త తెలిపారు. ఇసుక పాలసీలో అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంటి అవసరాలు, పునరావాస నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత కొద్దిరోజులుగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో ఈ మార్పులు చేసింది.

ఈ నిర్ణయాల వల్ల ఇసుక లభ్యత పెరుగుతుంది. ఇళ్ళుకట్టుకోవాలనే పేదలకు వెసులుబాటు లభించనుంది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది.

హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా, వంకలు, వాగులు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు సీఎం సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక విషయంలో విమర్శలు, ఆందోళనలు చేస్తున్నాయి విపక్షాలు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇసుక రవాణా విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. 

విప్లవాత్మక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న జగన్ మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతున్నవారికి శుభవార్త తెలిపారు. ఇసుక పాలసీలో అవకతవకలు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. తాజాగా ఇసుక పాలసీలో పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

ఇందులో భాగంగానే పేదలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంటి అవసరాలు, పునరావాస నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుక సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత కొద్దిరోజులుగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో ఈ మార్పులు చేసింది.

ఈ నిర్ణయాల వల్ల ఇసుక లభ్యత పెరుగుతుంది. ఇళ్ళుకట్టుకోవాలనే పేదలకు వెసులుబాటు లభించనుంది. అంతేకాకుండా బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా పర్మిట్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించింది. హౌసింగ్ స్కీమ్, ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ గృహ నిర్మాణాలకు కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వం పలు సవరణలను చేసింది. కాగా, వంకలు, వాగులు, యేర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు పేదలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం వారు ముందుగా సచివాలయ అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు సీఎం సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక విషయంలో విమర్శలు, ఆందోళనలు చేస్తున్నాయి విపక్షాలు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇసుక రవాణా విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle