newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

జగన్ ఎటాక్ కేసులో మరో కొత్త ట్విస్ట్

09-01-201909-01-2019 16:59:40 IST
2019-01-09T11:29:40.478Z09-01-2019 2019-01-09T11:29:31.144Z - - 17-07-2019

జగన్ ఎటాక్ కేసులో మరో కొత్త ట్విస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక కేసును ఓ శాఖ నుంచి మరో చోటుకి బదిలీ చేసినప్పుడు... దానికి సంబంధించిన వివరాల్ని సమర్పించడంతో పాటు విచారణలో సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. కానీ... వైఎస్ జగన్ కేసులో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవహారం ఏకంగా పిటిషన్లు వేసుకోవడం వరకూ వెళ్ళిందంటే... ప్రభుత్వ శాఖల మధ్య ఎంత సమన్వయలోపం ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైఎస్ జగన్ కోడికత్తి కేసును ఈమధ్యే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే! నిజానికి ఈ కేసు వెనుక ఎలాంటి కుట్ర లేదని, కేవలం సంచలనం కోసమే నిందితుడు శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేశాడని రాష్ట్ర పోలీసులు తేల్చేశారు. కానీ... వైసిపి వర్గాల సూచనల మేరకు వారి తరఫు లాయర్ మాత్రం తమకు ప్రభుత్వ పోలీసులపై నమ్మకం లేదని, ఈ కేసుని ఎన్ఐఏకు బదిలీ చేయాల్సిందేనని వాదించారు. ఈ ఎటాక్ ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి... ఈ కేసు కేంద్రం పరిధిలోని ఎన్ఐఏకు అప్పగించాల్సిందేనని పట్టుబట్టారు. ఆయన వాదనల్ని అంగీకరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరు ఒక్కసారిగా మారింది.

అంతకుముందు ఈ కేసు కేంద్రం పరిధిలోకే వస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు... ఇప్పుడు ఈ కేసుపై విచారణ జరిపేందుకు కేంద్రం ఎవరంటూ యూటర్న్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా... విచారణకు ఎన్ఐఏకు సహకరించకుండా నిరాకరిస్తున్నారు. దీంతో ఎన్ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే... ఈ కేసుని విజయవాడ కోర్టుకు బదిలీ చేయడంతో పాటు నిందితుడు శ్రీనివాసరావును తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle