newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

జగన్ అహంకారం, అజ్ఞానంతో ఆంధ్రా ప్రజలకు ద్రోహం

02-08-202002-08-2020 12:14:43 IST
Updated On 02-08-2020 13:20:28 ISTUpdated On 02-08-20202020-08-02T06:44:43.724Z02-08-2020 2020-08-02T06:42:33.392Z - 2020-08-02T07:50:28.322Z - 02-08-2020

జగన్ అహంకారం, అజ్ఞానంతో ఆంధ్రా ప్రజలకు ద్రోహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడురాజధానులకు సై అన్న జగన్ సర్కార్ తీరుపై ఏపీ టీడీపీ మండిపడింది. ఐదు కోట్ల ఆంద్రుల ఆకాంక్షలను, అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ 227 రోజులుగా రైతులు, వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటం బాధాకరం అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.

ఈ బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదు. ఇది వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే.5 కోట్ల ఆంధ్రుల తరపున రాజధానిపై ఉన్నత న్యాయస్ధానాల్లో పోరాడతాం.  రాష్ర్ట విభజన జరిగి అప్పులతో నవ్యాంధ్ర ప్రస్దానం మొదలైందన్నారు. ఈ నేపధ్యంలో రాష్ర్ట ప్రజలందరూ అమరావతే రాజధానిగా ఏకాభిప్రాయంతో అంగీకరించారు. చివరకు జగన్ కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు మాట తప్పడం జగన్ మోసకారితనానికి, దివాళుకోరుతనానికి నిదర్శనం. నాయకుడికి మాట మీద నిలబడే తత్వం, నైతిక విలువలు ముఖ్యం అన్నారు కళా వెంకట్రావు. 

కానీ జగన్ లో అవి ఏ కోశాన కూడా లేవు అనేది రాష్ట్ర ప్రజలకు మరోసారి బహిర్గతమైంది. ముఖ్యమంత్రి జగన్ తన స్వార్ధం కోసం 3 రాజధానుల పేరుతో 5 కోట్ల మందికి, భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. రూ. 5 తో అన్నం పెట్టడం చేతకాక అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల పొట్టకొట్టిన జగన్  3 రాజధానులు ఎలా  కడతారో చెప్పాలి?  అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది. 

ఇప్పుడు రాజధానిని మారిస్తే ఆ ప్రజాధనం  వృధా కాదా? దీనికి బాధ్యత ఎవరిది? అమరావతిపై దుష్ర్పచారం చేసి ఇప్పటికే ఏడాదిన్నర కాలం వృధా చేశారు.  ఇక మిగిలిన మూడున్నరేళ్ల కాలం 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప 3 బిల్డింగులు కూడా కట్టలేరు.  3 రాజధానులతో రాష్ర్టం ఏ విధంగా అభివృద్ది చెందుతుంతో జగన్ చెప్పాలి? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల  ఆ ప్రాంత యువతకు ఎన్ని వేల ఉద్యోగాలొస్తాయి? ఆ ప్రాంతంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయో చెప్పాలి?  హైకోర్టు వల్ల రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ది చెందుతుందా?

విశాఖలో నాలుగు భవనాలు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి పరిపాలన నిర్వహిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందా? వైసీపీ నేతలకు ప్రజలు అమాయకుల్లా కన్పిస్తున్నారా?  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి తప్ప పరిపాలన వికేంద్రీకరణ కాదు. ఈ విషయం జగన్ కూడా తెలుసు.  కానీ   జగన్ అహంకారం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ.. తన పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి  ప్రజల మద్య చిచ్చు పెట్టి భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని రాష్ర్ట ప్రజలు క్షమించరని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కళా వెంకట్రావు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle