newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

జగన్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం

30-05-201930-05-2019 12:33:40 IST
Updated On 30-05-2019 12:41:08 ISTUpdated On 30-05-20192019-05-30T07:03:40.842Z30-05-2019 2019-05-30T07:03:35.416Z - 2019-05-30T07:11:08.795Z - 30-05-2019

జగన్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. తీరని కల ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సాకారం అయింది. ఆంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ .. జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ అభిమానులు తరలివచ్చారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు, వైకాపా శ్రేణుల సమక్షంలో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌  సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేడియం లోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. జగన్‌ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైకాపా నేతలు హెలికాప్టర్‌ ద్వారా పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్ కాన్వాయ్ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుంది. స్టేడియం మైదానంలో ఓపెన్‌ టాప్‌ వాహనంపై నుంచి అభిమానులకు జగన్ అ‌భివాదం చేశారు.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle