newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

జగన్‌ సిట్‌పై అధికారులలో మొదలైన ఆందోళన!

24-02-202024-02-2020 10:21:32 IST
Updated On 24-02-2020 17:23:54 ISTUpdated On 24-02-20202020-02-24T04:51:32.949Z24-02-2020 2020-02-24T04:51:30.245Z - 2020-02-24T11:53:54.427Z - 24-02-2020

జగన్‌ సిట్‌పై అధికారులలో మొదలైన ఆందోళన!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ జరగని విధంగా ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై గంపగుత్తాగా విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఒక పోలీస్ స్టేషన్ కు ఉండే అధికారాలన్నీ కల్పిస్తూ పది మంది పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వంలో జరిగిన ఘటన, లేక ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టంపై సిట్ విచారణకు ఆదేశించడం చూడగా ఐదేళ్ల పాలనపై ఏర్పాటు ఇదే తొలిసారి.

కాగా, ఈ సిట్ విచారణపై ప్రతిపక్షం ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి కూడా తెలిసిందే. ఏదో ఒక వంక చూపి తనకి అంటుకున్న అవినీతి మారకను చంద్రబాబుకు కూడా అంటించాలన్నదే సీఎం జగన్ ధ్యేయంగా కక్ష్యతో పాలన సాగుతుందని ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. విశ్లేషకులు కూడా ఇది కక్ష్య సాధింపులో భాగంగానే కనిపిస్తుందని తేల్చేశారు.

అయితే సిట్ విచారణపై రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో ఆందోళన మొదలైనట్లుగా వినిపిస్తుంది. సిట్ విచారణ లక్ష్యం ప్రతిపక్షమే అయినా అది అధికారుల మెడకు చుట్టుకుంటుందన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వంలో నిర్ణయాలు సీఎం, మంత్రులే తీసుకున్న ప్రతి దానిపై ఉన్నతాధికారుల సంతకాలే ఉంటాయి. అంటే ముందుగా ఆ అధికారులే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వం విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటే వాటికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రాథమిక స్థాయి పత్రాలపై మంత్రుల సంతకాలు ఉంటాయి. ఒకవేళ అవకతవకలు జరిగినట్లుగా తేలినా ముందుగా ప్రభావితమయ్యేది కూడా ఆ అధికారులే కావడంతో ఇప్పుడు ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుంది.

గత ప్రభుత్వంలో నేతలు అవినీతికి పాల్పడినట్లుగా తేలినా అందులో అధికారులు కూడా భాగమవడం ఖాయం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో.. జగన్ అక్రమాస్తుల కేసులలో జరిగింది కూడా అదే. అంటే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు అధికారులు బలికావడం ఖాయం. వైఎస్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాపానికి ఇప్పటికీ ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

కానీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు మాత్రం సీఎంగా, రెండు రాష్ట్రాలలో మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా సిట్ దర్యాప్తును టీడీపీ కక్ష్య సాధింపుగా ముమ్మరంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ విచారణలో అవకతవకలు బయటపడితే దానికి సానుభూతిగా మరో లెవల్ కు తీసుకెళ్లి ప్రజలలో ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉండనున్నాయి. ఎటు చూసినా అధికారులనే ముందు బదనాం చేసే చట్టాలతో దడ మొదలైనట్లుగా తెలుస్తుంది.

చదవండి : సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   3 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   3 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   3 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   7 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   9 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   12 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   12 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   13 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   14 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle