newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

18-11-201918-11-2019 02:05:31 IST
Updated On 18-11-2019 12:22:33 ISTUpdated On 18-11-20192019-11-17T20:35:31.449Z18-11-2019 2019-11-17T20:11:39.152Z - 2019-11-18T06:52:33.906Z - 18-11-2019

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కుల రాజకీయాలు పరాకాష్టకు చేరాయి.. నిన్నమొన్నటి వరకు కులాల మధ్య సాగిన ఆధిపత్యపోరు .. ఇప్పుడు ఒకే కులం మధ్య సాగుతుంది. దీనంతిటికి కారణం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ అని ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. కమ్మ కులంలోని నేతల మధ్య చిచ్చురేపడంలో జగన్‌ సక్సెస్‌ అయ్యాడని.. దీంతో టీడీపీ వెంట ఉన్న కమ్మ కులస్తులు భారీగా వైసీపీవైపు మళ్లడం ఖాయమని వైసీపీ శ్రేణుల్లో చర్చ సాగుతుంది.

అధికారం కోల్పోయిన టీడీపీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో పాటు.. చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో జరిగిన అంతర్గత విషయాలనుసైతం బయటపెడుతూ పార్టీ పతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీనేతలుసైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా టీడీపీ వెన్నంటే ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఏ కొత్తపార్టీ వచ్చినా ఆ సామాజిక వర్గం నుంచి టీడీపీ ఓటుబ్యాంకు చెక్కుచెదరదు. ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

టీడీపీ అంటేనే కమ్మసామాజికవర్గం పార్టీ అని, ఐదేళ్ల తెదేపా పాలనలో ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని వైసీపీ విస్తృత ప్రచారం చేసింది. ఏ శాఖలోనైనా ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకే పెద్దపీట వేస్తున్నారని ప్రచారం సాగించింది. దీంతో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీవైపు మళ్లారు. ఫలితంగా ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతోపాటు.. టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.

ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీ నేతలను పలు విధాలుగా టార్గెట్‌ చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ పార్టీకి పెద్దబలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంలో రచ్చలేపడంలో సఫలమైనట్లు ప్రచారం సాగుతుంది. టీడీపీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను వైసీపీలోకి తీసుకోవటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని టీడీపీకి దూరం చేసేలా వైసీపీ ప్లాన్‌ చేసినట్లు ఇటీవల ప్రచారం సాగింది. దీనిని పక్కాగా అమలు చేసేందుకు బలంగా కమ్మముద్ర పడిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్‌లను వైసీపీలోకి లాగింది. అవినాశ్‌ ఇప్పటికే వైసీపీలో చేరగా.. వల్లభనేని వైసీపీలో చేరబోతున్నారు.

అవినాశ్‌ వైసీపీలో చేరిన తరువాత టీడీపీపై నామమాత్రంగానే విమర్శలు చేసినా.. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన వల్లభనేని వంశీమాత్రం టీడీపీని ఏకిపారేస్తున్నారు. వంశీ వ్యాఖ్యలకు ధీటుగా టీడీపీలోని నేతలు కౌంటర్‌ ఇచ్చినప్పటికీ.. వంశీకితోడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత, మంత్రి కొడాలి నానిసైతం రంగంలోకి దిగడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. పనిలోపనిగా కమ్మ సామాజిక వర్గంసైతం టీడీపీ వెంటలేరని, వైసీపీకే మద్దతుగా నిలిచారని ఇరు నేతలు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు, లోకేశ్‌లు, ఆ పార్టీలోని ఇతర కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను వంశీ, కొడాలినాని టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు భావించినట్లుగా కమ్మ వర్సెస్‌ కమ్మ సామాజిక వర్గం నేతల మధ్య మాటలదాడి శృతిమించిపోయింది. దీంతో ఏపీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయినట్లు ప్రచారం సాగుతుంది. ఒక వర్గం వైసీపీ

వైపు వచ్చినట్లు ప్రచారం సాగుతుండగా.. టీడీపీ వైపు ఉన్న మరోవర్గంలోని కొందరు బీజేపీ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు టీడీపీ వెంట ఉన్న ఓటుబ్యాంకు భారీగా చీలడంతో అది వైసీపీ ప్లస్‌పాయింట్‌గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle